తెలుగు భాష తప్పనిసరి: సీఎం కేసీఆర్

వచ్చే విద్యాసంవత్సరం (2018-19) నుంచే రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగు భాషను తప్పనిసరిగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

Last Updated : Mar 21, 2018, 01:51 PM IST
తెలుగు భాష తప్పనిసరి: సీఎం కేసీఆర్

వచ్చే విద్యాసంవత్సరం (2018-19) నుంచే రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగు భాషను తప్పనిసరిగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలుగు భాషను ఒక సబ్జెక్ట్‌గా బోధించాలని  ఆదేశించారు. అ మేరకు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకొస్తామని కేసీఆర్ ఆన్నారు.

తమిళనాడులో అక్కడి మాతృభాష తమిళ బోధన విధానాన్ని అధ్యయనం చేసిన అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలుగును ఒక సబ్జెక్ట్‌గా బోధించడంపై రూపొందించాల్సిన విధివిధానాలపై అధికారులతో కేసీఆర్ చర్చించారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థులు కూడా తెలుగు భాష నేర్చుకోవాలనే నిబంధన పెడుతున్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో కూడా తప్పనిసరిగా ఒక తెలుగు పండిట్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. తరగతుల వారీగా తెలుగు పాఠ్య ప్రణాళికను రూపొందించాల్సిందిగా తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య అకాడమీలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు.

ఒకటో తరగతి నుంచి మొదలు..

తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్‌ ప్రక్రియ దశల వారీగా అమలు కానుంది. వచ్చే విద్యా సంవత్సరంలో మొదట ఒకటో తరగతితో ప్రారంభమవుతుంది. కన్నడ, తమిళం, మరాఠీ తదితర పాఠశాలల్లోనూ ఒకటో తరగతి చదివే వారికి తెలుగు సబ్జెక్ట్‌ ఉంటుంది. సీబీఎస్‌ఈ స్కూళ్లలోనూ ఒకటో తరగతి నుంచే తెలుగు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎంసెట్‌లో ర్యాంకింగ్‌కు ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ, తెలుగేతర విద్యార్థులు హైదరాబాద్‌లో ఇంటర్‌ చదువుతుండటం, సంస్కృతం, హిందీ లెక్చరర్ల ఆందోళనలు వంటివి దృష్టిలో పెట్టుకొని మొదటి దశలో 10వ తరగతి వరకు మాత్రమేనని ప్రభుత్వం ప్రకటించింది.

Trending News