Ghani Movie Trailer: 'ఈ బాక్సర్ కు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు'.. గని మూవీ ట్రైలర్ రిలీజ్!

Ghani Movie Trailer: బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం 'గని'. ఈ చిత్రం ఏప్రిల్ 8న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను గురువారం చిత్రబృందం విడుదల చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2022, 12:31 PM IST
Ghani Movie Trailer: 'ఈ బాక్సర్ కు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు'.. గని మూవీ ట్రైలర్ రిలీజ్!

Ghani Movie Trailer: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్‌ హీరోహీరోయిన్లుగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గని'. కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా.. ఎట్టకేలకు థియేటర్ లో విడుదలకు సిద్ధమైంది. 'గని' మూవీని ఏప్రిల్ 8న విడుదల చేసేందుకు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. దీంతో సినిమా ప్రమోషన్స్ ను చిత్రబృందం మొదలుపెట్టేసింది. గురువారం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. 

'నాకు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు' అంటూ వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ మరింత ఆకట్టుకునే విధంగా ఉంది. అమ్మకు ఇచ్చిన మాట కోసం ఓ యువకుడు బాక్సర్ గా మారి.. ఆ తర్వాత అనుకున్న స్థాయికి చేరాడా? లేదా అనే తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందేనని నిర్మాతలు అంటున్నారు. 

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్ గా తెరపై కనువిందు చేయనున్నారు. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. ఈ సినిమాలో ఉపేంద్ర, జగపతిబాబు, నదియా, సునీల్‌దత్‌ తదితరులు నటించారు. తమన్ స్వరాలను సమకూర్చారు.   

ALso Read: Anupama Photos: నువ్వు సిగ్గు పడితే బాగుంటాది ఓ అనుపమ.. సిగ్గుల సింగారి నువ్వేలేవమ్మా!

Also Read: Ananya Pandey Photos: సన్ సెట్ లో సముద్రపు ఒడ్డున రౌడీ హీరోయిన్ హల్ చల్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x