PAN-Aadhaar: పాన్-ఆధార్ లింక్ చేసేందుకు తుడి గడువు దగ్గరకు వస్తోంది. ఈ ఈ నెలాఖరుతో (మార్చి 31) గడువు తేదీ ముగియనుంది. అంటే పాన్-ఆధార్ అనుసంధానానికి ఇంకా ఆరు రోజులే మిగిలి ఉందన్నమాట.
నిజానికి రెండేళ్లుగా పాన్-ఆధార్ అనుసంధానానికి గడువు పొడగిస్తూ వస్తోంది ప్రభుత్వం. కరోనా నేపథ్యంలో గడువు పెంపు నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు కొవిడ్ తగ్గుముఖం పట్టింది. దీనితో మరోసారి గడువు పెంచే అవకాశం లేదని తెలుస్తోంది. కాబట్టి వీలైనంత త్వరగా ఆధార్-పాన్ లింక్ చేయకుంటే.. ఆ ప్రక్రియను పూర్తి చేయడం ఉత్తమమని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు.
పాన్ ఆధార్ అనుసంధానం చేయండం ఎలా?
- పాన్- ఆధార్ లింక్ కోసం ముందుగా.. ఇన్‌కం ట్యాక్స్ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. ఇందులో పాన్-ఆధార్ లింక్ అయ్యిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
- వెబ్సైట్లో.. 'లింక్ ఆధార్ స్టేటస్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఎంచుకోవాలి
- కొత్త విండోలో.. పాన్-ఆధార్ నంబర్లను నమోదు చేసి.. వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ క్లిక్ చేయాలి.
- ఇక్కడ ఆధార్-పాన్ స్టేటస్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఆధార్ పాన్ లింక్ అయ్యుంటే.. పాన్-ఆధార్ లింక్ అయ్యిందని.. అనుసంధానమై ఉందని రాసి ఉంటుంది. అలా కనిపించకుంటె వెంటనే ఆ పనిని పూర్తి చేయాలి.
- ఇన్‌కం ట్యాక్స్ వెబ్సైట్లోనే.. ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.
గడువులోపు పాన్-ఆధార్ లింక్ చేయకుంటే?
గడువులోపు పాన్-ఆధార్ లింక్ చేయకుంటే.. ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడుతుంది. పరిమితికి మించి లావాదేవీలు జరిపేందుకు వీలుండదు. ఇప్పటికే పలు బ్యాంకులు ఈ విషయాన్ని వినియోగదారులకు స్పష్టం చేశాయి కూడా. అంతే కాకుండా పాన్ ఇన్ యాక్టివ్‌గా మారిపోతుంది. దీనితో పాటు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావడం, రూ.10 వేల జరిమానా పడే అవకాశం ఉంది.
Also read: Tata Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ.. ఒక్కసారి ఛార్జ్‌తో 400 కిలో మీటర్ల ప్రయాణం!
Also read: Aadhaar ration linking: ఆధార్, రేషన్ లింక్‌కు గడువు పెంపు- కొత్త డేట్ ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook