AAP in Telangana: తెలంగాణలో ఆప్ వల్ల ఎవరికి నష్టం..ఎవరికి ప్రయోజనం

AAP in Telangana: దేశ రాజధాని ఢిల్లీలో పట్టు సాధించిన ఆప్..పంజాబ్ కైవసం చేసుకుంది. తదుపరి దృష్టి తెలంగాణపై పెట్టనుండటం ఆందోళన కల్గిస్తోంది. తెలంగాణలో ఆప్ అడుగుపెట్టడం ఎవరికి ఏ మేర నష్టమో పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 29, 2022, 01:21 PM IST
 AAP in Telangana: తెలంగాణలో ఆప్ వల్ల ఎవరికి నష్టం..ఎవరికి ప్రయోజనం

AAP in Telangana: దేశ రాజధాని ఢిల్లీలో పట్టు సాధించిన ఆప్..పంజాబ్ కైవసం చేసుకుంది. తదుపరి దృష్టి తెలంగాణపై పెట్టనుండటం ఆందోళన కల్గిస్తోంది. తెలంగాణలో ఆప్ అడుగుపెట్టడం ఎవరికి ఏ మేర నష్టమో పరిశీలిద్దాం..

రాజకీయాల్లో చోటు చేసుకునే పరిణామాలు కొన్ని పార్టీలకు లబ్ది చేకూర్చితే.. మరికొన్ని పార్టీలకు నష్టం కలిగిస్తూ ఉంటాయి. తెలంగాణ సమాజంలో గత కొంత కాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు బీజేపీకి లబ్ది చేకూరుస్తున్నాయి. దీంతో క్రమక్రమంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా  బీజేపీని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. టీఆర్ఎస్ , బీజేపీ మధ్య సాగుతున్న పోరులో కాంగ్రెస్ నష్టపోతోంది. 

అధికార పార్టీ చేసే తప్పులు బీజేపీకి వరం అవుతుండడంతో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ దిగజారి పోతోంది. ఉపఎన్నికల ఫలితాలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఇదే అంశాన్ని రుజువు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ పార్టీకి ఓ ఆశాకిరణం దొరికినా గ్రూపు కుమ్ములాటల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఛర్మిషా వర్కవుట్ అవడం లేదు. నిత్యం ప్రజల్లో ఉండటం వల్ల ఇతర పార్టీల వైపు మళ్లుతున్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు మళ్లీ తమ వైపు వస్తుందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో ఈ మేరకు ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. సరిగ్గా ఇదే తరుణంలో తెలంగాణ రాజకీయాల్లోకి ఆరగేంట్రం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తోంది. అటు టీఆర్ఎస్‌కు ఇటు బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకుపై ఇంత కాలం కాంగ్రెస్ పెట్టుకున్న ఆశల్ని ఆప్ గల్లంతు చేసే ప్రమాదం ఉంది. ఈ ఓటు బ్యాంకు కాస్త ఆప్ వైపుకు మళ్లితే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ఆ తరువాత తెలంగాణ జనసమితి పేరుతో రాజకీయ పార్టీని కూడా స్థాపించారు కోదండరామ్. అయితే ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపులేకపోతోంది. దీంతో టీజేఎస్ పార్టీని కోదండరామ్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని సమాచారం. ఇదే కనుక జరిగితే ఆప్ తెలంగాణలో బలపడేందుకు అవకాశాలు బలపడతాయి. వచ్చే నెలలో కేజ్రీవాల్ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారని.. ఆ సమయంలోనే కోదండరామ్ తన పార్టీ టీజేఎస్‌ను ఆప్‌లో విలీనం చేసి తెలంగాణలో ఆప్‌కు సారథ్యం వహిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కోదండరామ్ ‌మాత్రం స్పందించలేదు. 

మరోవైపు కోదండరామ్ తన పార్టీలోని ఆప్‌లోని విలీనం చేసి.. తెలంగాణలో ఆప్‌కు సారథ్యం వహిస్తే.. ఆ ప్రభావం తమపై ఎంతవరకు ఉంటుందనే దానిపై కాంగ్రెస్‌లో టెన్షన్ నెలకొన్నట్టు తెలుస్తోంది.ఒక వేళ గనుక ఇదే కనుక నిజమైతే టీఆర్ఎస్, బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకును ఆప్ చీల్చే అవకాశం ఉంది. మరోవైపు అప్ బలపడేందుకు కోదండరాం ఇమేజ్ ఉపయోగపడే అవకాశం ఉంది. వీరికి కేజ్రీవాల్ చరిష్మా తోడయితే ఆప్ తప్పకకుండా కొంత మేరకు తెలంగాణలో రాజకీయ శక్తిగా ఎదుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీ మరింత ప్రమాదంలో పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అదే సమయంలో ఆప్ కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏ మేరకు చీలుతుందనేది పరిశీలించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతవరకూ చీలితే అధికార పార్టీకు అంతగా ప్రయోజనముంటుంది. అంటే ఆప్ రావడం వల్ల బీజేపీకు కలిగే ప్రయోజనం కంటే టీఆర్ఎస్‌కే ఎక్కువ ప్రయోజనమనే వాదన కూడా విన్పిస్తుంది. 

Also read: Online Ticketing: ఏపీలో త్వరలో ఆన్‌లైన్ సినిమా టికెట్ల అమ్మకాలు ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News