Online Ticketing: ప్రతి సామాన్యుడికి వినోదం అందుబాటులో తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం వివిధ రకాల చర్యలు చేపడుతోంది. సినిమా టికెట్లు పూర్తిగా ఆన్‌లైన్ చేయనున్నట్టు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థ రానుంది. సినిమా టికెట్లను పూర్తిగా ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వినోదం ప్రతి సామాన్యుడికి సైతం అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఇప్పటికే ప్రభుత్వం వివిధ రకాల చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే థియేటర్ టికెట్లను అదుపు చేసింది. ఎక్కడ ఎంతమేర టికెటింగ్ ఉండాలో నిర్ణయిస్తూ..జీవో విడుదల చేసింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తోంది.
త్వరలో సినిమా టికెట్లను ఆన్‌లైన్ ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి టెండర్లు పూర్తి చేసింది. ప్రైవేట్ సంస్థల కంటే తక్కువ ధరకు ప్రభుత్వమే ఈ వ్యవస్థను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం నిర్వహించిన టెండర్ల వ్యవస్థలో జస్ట్ టికెట్ సంస్థ ఎల్ 1గా నిలిచినట్టు సమాచారం. రాష్ట్రంలోని అన్ని సంస్థలు ఒకే సంస్థ ద్వారా టికెట్ల అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో ప్రేక్షకులపై ఆన్‌లైన్ ఛార్జీల భారం పడకుండా సన్నాహాలు చేసింది.
ఈ నిర్ణయం ద్వారా టికెట్ రేట్ల నియంత్రణతో పాటు క్యూలో ప్రేక్షకులు గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరముండదు. మరోవైపు బ్లాక్ టికెట్ల విక్రయం కూడా ఆగుతుంది.
Also read: Poonam Bajwa: బికినీలో పూనమ్ బజ్వా.. హద్దులు దాటిన అందాల ప్రదర్శన!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook