JOS Buttler: ఐపీఎల్ 2022లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అవుటని ఎంపైర్ చెప్పినా వినలేదు ఆ ఆటగాడు. ఎంపైర్ కంటే నాకే ఎక్కువ తెలుసన్నట్టుగా వ్యవహరించాడు. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు బట్లర్ వ్యవహారం అందర్నీ కాస్సేపు ఆశ్చర్యపర్చింది. ఆ తరువాత అతని ఆతని నమ్మకానికి అందరూ ఫిదా అయ్యారు. ఐపీఎల్ 2022లో భాగంగా ఆర్సీబీ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఆర్బీబీ బౌలర్ హర్షల్ పటేల్ 15వ ఓవర్ వేశాడు. ఆ ఓవర్ నాలుగవ బంతి స్లో యార్కర్. బంతి బట్లర్ ప్యాడ్స్‌ను తాకింది. అంతే ఆర్సీబీ ఆటగాళ్లు అప్పీల్ చేయగానే ఎంపైర్ అవుటిచ్చేశాడు. కానీ బట్లర్ అసలు క్రీజు నుంచి కదల్లేదు. అది అవుట్ కాదనేది అతని నమ్మకం.
బట్లర్ రివ్యూ కోరగా..అది అవుట్ కాదని స్పష్టంగా తేలింది. బంతి బట్లర్ ప్యాడ్ల కంటే ముందు బ్యాట్‌ను తాకింది. ఆ తరువాత ప్యాడ్స్‌కు తగిలింది. అంటే బ్యాట్ అండ్ ప్యాడ్..సో నాటవుట్. రివ్యూ తరువాత అదే అంపైర్ నాటవుట్ అని ప్రకటించాడు. ఇది చూసిన అభిమానులు బట్లర్ వర్సెస్ అంపైర్ మధ్య మీమ్స్ క్రియే చేశారు. అంపైర్‌తో పని లేదు ..నాకన్నీ తెలుసు..అని బట్లర్ అంటున్నట్టుగా మీమ్స్ వైరల్ చేశారు. బట్లర్ నమ్మకానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
వాస్తవానికి 37 పరుగుల వద్దే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ తరువాత ఆర్సీబీ బౌలర్లను వాయించి పడేశాడు. 47 బంతుల్లో ఆరు సిక్సర్లతో 70 పరుగులు చేసి బట్లర్ నాటవుట్‌గా నిలిచాడు. బట్లర్, హెట్మెయిర్ కలిసి చివరి రెండు ఓవర్లలో 42 పరుగులు సాధించారంటే ఎలా ఆడారో అర్ధం చేసుకోవచ్చు.
Also read: RCB Record: ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ అరుదైన ఫీట్, వంద విజయాలు నమోదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook