Bank Holidays: కస్టమర్లకు అలర్ట్.. ఈ రోజు నుండి వరుసగా 4 రోజులు బ్యాంకు సెలవులు..

Bank Holidays : బ్యాంకు కస్టమర్లకు కీలక సూచన... ఈ రోజు నుండి వరుసగా 4 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. కాబట్టి బ్యాంకు పని నిమిత్తం వెళ్లేవారు ఈ విషయాన్ని గమనించాలి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2022, 06:50 AM IST
  • ఈ వారంలో బ్యాంకులకు 4 రోజులు సెలవులు
  • వరుసగా 4 రోజుల పాటు బ్యాంకు సెలవులు
  • పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
Bank Holidays: కస్టమర్లకు అలర్ట్.. ఈ రోజు నుండి వరుసగా 4 రోజులు బ్యాంకు సెలవులు..

Bank Holidays : బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్... ఈ రోజు నుండి నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 17 వరకు బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సెలవులు వర్తించవు. ఆయా రాష్ట్రాల్లోని పండగలు, ప్రత్యేక సందర్భాలను బట్టి ఈ సెలవులు ఉంటాయి. ఈ వారంలో అలా మొత్తం నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఏప్రిల్ 14 :

ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి. ఇదే రోజు మహావీర్ జయంతి, వైశాఖి, తమిళనాడు న్యూ ఇయర్, బిజు ఫెస్టివల్ కూడా వస్తున్నాయి. మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ 14న బ్యాంకులకు సెలవు వర్తిస్తుంది.

ఏప్రిల్ 15 :

ఏప్రిల్ 15న గుడ్ ఫ్రైడేతో పాటు బెంగాలీ న్యూ ఇయర్, హిమాచల్ డే వస్తున్నాయి. రాజస్తాన్, జమ్మూకశ్మీర్, శ్రీనగర్ మినహా ఏప్రిల్ 15న అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు మూతపడనున్నాయి. 

ఏప్రిల్ 16 :

ఏప్రిల్ 16న కేవలం అస్సాంలో మాత్రమే బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ రోజు అస్సాంలో బొహగ్ బిహు పండగను జరుపుకుంటారు.

ఏప్రిల్ 17 :

ఏప్రిల్ 17 ఆదివారం కాబట్టి... ఈరోజు అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి. 

ఏప్రిల్ నెలలో బ్యాంకులకు మొత్తంగా 15 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవనే విషయాన్ని గమనించాలి. 

Also Read: Amazon Sale: రూ.4 వేల విలువైన బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఇప్పుడు రూ.899లకే.. ఆఫర్ ఒక్కరోజు మాత్రమే!

Also Read: IRCTC Booking: IRCTC వెబ్ సైట్ ద్వారా ఒకే నెలలో ఎక్కువ టికెట్లు బుక్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News