Hanuman Janmotsav 2022 : హనుమాన్ జన్మోత్సవం కోసం హనుమాన్ భక్తులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రతీ సంవత్సరం చైత్ర మాసం పౌర్ణమి నాడు హనుమాన్ జన్మోత్సవం జరుపుకుంటారు. ఈ సంవత్సరం హనుమాన్ జన్మోత్సవం 16 ఏప్రిల్ 2022న వస్తుంది. ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హనుమాన్ ఆలయాల్లో హనుమాన్ జన్మోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటారు. ఆరోజు హనుమాన్ భక్తులు ఉపవాసం ఉంటారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం పూజా క్రతువులు నిర్వహించి హనుమాన్ను ప్రసన్నం చేసుకుంటారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. చాలామంది హనుమాన్ జన్మోత్సవాన్ని హనుమాన్ జయంతిగా పిలుస్తున్నారు. కానీ అది సరికాదు.
ఇది 'జయంతి' కాదు 'జన్మోత్సవం' అని చెప్పండి :
సాధారణంగా 'జయంతి' అనే పదాన్ని పరమపదించిన వ్యక్తుల పుట్టినరోజును తెలిపేందుకు వాడుతారు. దైవానికి సంబంధించిన వేడుకలకు జయంతి అనే పదం వాడరాదు. కాబట్టి హనుమాన్ జయంతి అని కాకుండా హనుమాన్ జన్మోత్సవం అని పిలవడం సరైనది. ఇప్పటికీ చాలామంది 'హనుమాన్ జయంతి' అనే పదాన్నే ఎక్కువగా వాడుతున్నారు. అయితే నిజమైన ఆంజనేయ భక్తులు హనుమాన్ జన్మోత్సవంగా దీన్ని పిలవాలని గ్రహించాలి.
జన్మోత్సవ్ అనే పదం అమరత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆ దైవానికి సంబంధించిన వేడుకలకు ఆ పదమే సరైనది. ఎవరికైనా శుభాకాంక్షలు చెప్పేటప్పుడు 'హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు' అని చెప్పాలి. అంతేకానీ 'హనుమాన్ జయంతి శుభాకాంక్షలు' అని చెప్పవద్దు.
హనుమాన్ చాలీసా పఠించండి :
హనుమాన్ జన్మోత్సవం రోజు హనుమాన్ చాలీసా పఠిస్తే దైవ అనుగ్రహం కలుగుతుంది. హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా పఠించాలి. లేదా ఇంట్లో హనుమాన్ చిత్రపటం ముందు శ్రద్ధంగా హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి.
Also Read: Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌తో మీ బలాలు, బలహీనతలు తెలుసుకోవచ్చు... ఇదిగో ఇలా...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook