అంతరిక్షంలో ఆరు గంటలు...టూర్ ప్లాన్ చేస్తున్నస్పేస్ పెర్స్పెక్టివ్

అంతరిక్షంలో ప్రయాణించాలను కునే వాళ్ల కోసం ప్రత్యేకంగా ఓ టూర్ ప్లాన్ చేసింది. 2024లో ఫస్ట్ బ్యాచ్ ను అంతరిక్షంలోకి పంపేందుకు  ఏర్పాట్లు చేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 26, 2022, 03:37 PM IST
  • అంతరిక్షంలో ప్రయాణించాలను కునే వాళ్ల కోసం ప్రత్యేకంగా టూర్ ప్లాన్
  • 2024లో ఫస్ట్ బ్యాచ్ ను అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు
  • అంతరిక్షంలో 6 గంటల పాటు సాగే ప్రయాణం
అంతరిక్షంలో ఆరు గంటలు...టూర్ ప్లాన్ చేస్తున్నస్పేస్ పెర్స్పెక్టివ్

ట్రావెలింగ్ అంటే మనలో చాలా మందికి తెగ పిచ్చి. కాస్త టైం దొరికిందంటే చాలు బ్యాగ్ సర్దేసి ఎంచక్కా ఎక్కడికో ఓ చోటికి వెళ్లిపోతుంటారు. అయితే ఎంత తిరిగిన ఈ భూమ్మీదే కదా అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ల కోసం గుడ్ న్యూస్ చెప్పింది అమెరికాకు చెందిన స్పేస్ పెర్స్పెక్టివ్ కంపెనీ (Space Perspective Spaceship) స్పేస్ పెర్స్పెక్టివ్ అనే ట్రావెల్ ఏజెన్సీ. అంతరిక్షంలో ప్రయాణించాలను కునే వాళ్ల కోసం ప్రత్యేకంగా ఓ టూర్ ప్లాన్ చేసింది. 2024లో ఫస్ట్ బ్యాచ్ ను అంతరిక్షంలోకి పంపేందుకు  ఏర్పాట్లు చేస్తోంది. అంతరిక్షంలో 6 గంటల పాటు సాగే ఈ ప్రయాణం కోసం ప్రత్యేకంగా స్పేస్ షిప్‌ను తయారు చేస్తోంది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ కు నెప్ట్యూన్(neptune) అని పేరు కూడా పెట్టింది.  స్పేస్ పెర్స్పెక్టివ్ 2024 చివరిలో కెన్నెడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడా నుంచి దీనిని ప్రయోగించనున్నారు. 

ఇక్కడ భూమి మీద అంటే దిక్కులు ఉంటాయి. కాని అంతరిక్షంలో ఉండవు కదా.... అందుకే భూమ్యాకాశాలను, నక్షత్ర మండాలలను ఏకకాలంలో 360 డిగ్రీల కోణంలో చూసే విధంగా ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేస్తోంది. నెప్ట్యూన్ స్పేస్ బెలూన్‌లో కూర్చుని ఇవన్నీ చూడొచ్చని ప్రకటించింది. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా... ఈ టూర్ కు అయ్యే ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంది. ఈ స్పెస్ క్ట్రాఫ్ట్ లో ఒక్క సీటుకు కోటి రూపాయలు ఛార్జి చేస్తోంది. ఆరు గంటల ప్రయాణికి కోటి రూపాయల అంటూ అంతా మొహం వెళ్లబెట్టుకుంటున్నారు. అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉన్నాయని స్పేస్ పెర్స్పెక్టివ్ సంస్థ చెప్తోంది. యాత్రికులకు వినూత్నమైన అనూభూతిని కల్పించేందుకే ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు వెల్లడించింది. 

ఈ ట్రావెల్ ఏజెన్సీ విడుదల చేసిన ఫోటోల్లో లగ్జరీ లాంజ్‌లు, టేబుల్స్,  కుర్చీలు, మంచాలు, కాక్ టెయిల్ మెనూలు కనిపిస్తున్నాయి. అంతరిక్ష నౌకలో బాత్రూమ్ కూడా విలాసవంతమైనదిగా కనిపిస్తోంది. నెప్ట్యూన్ స్పేస్ క్రాఫ్ట్ లో  ఇంటరాక్టివ్ స్క్రీన్‌లు, వైఫై వంటి సదుపాయాలు ఉండడం విశేషం. ఇక విచిత్రం ఏమిటంచే ఈ అంతరిక్ష నౌకలో ఓ బార్ ను కూడా ఏర్పాటు చేసింది సంస్థ. అయితే ఈప్రాజెక్టు ఇంకా ప్రయోగదశలోనే ఉందని ప్రకటించింది. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈపాటికే ఈ యాత్రకు ఆసక్తి చూపిస్తూ 600 మంది సీట్లు బుక్ చేసుకున్నారు. అయితే వీరందరికీ ప్రత్యేక శిక్షణ తప్పదని స్పేస్ పెర్స్పెక్టివ్ సంస్థ ప్రకటించింది. 

also read

Elon Musk Twitter: ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్.. భారీ డీల్ ​డీటెయిల్స్ ఇవే?

Russia Ukraine War: రష్యా ఆయిల్ డిపోలో పేలుడు.. భారీ ఎత్తున ఎగిసిపడ్డ మంటలు.. ఉక్రెయిన్ పనేనా..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News