Adi Shankaracharya Jayanti 2022: ఆది శంకరాచార్యులు అనగానే 'అద్వైత' సిద్ధాంతం గుర్తొస్తుంది. హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో శంకరాచార్యులు ప్రథములు. హిందూ మత పరిరక్షణ కోసం, హిందువుల ఐక్యత కోసం ఆయన విశేష కృషి చేశారు. సాక్షాత్తు పరమశివుడి ప్రతిరూపంగా ఆయన్ను ఆరాధిస్తారు. సమాజం అనేక మతాలు, వాదాలతో విచ్చిన్నంగా ఉన్న దశలో ఆది శంకరాచార్య హిందూ మతానికి కొత్త ఊపిరి పోశారని చెబుతారు. ఆది శంకరాచార్యులే లేకపోయి ఉంటే సనాతన ధర్మానికి ఒక దశ, దిశ లేకపోయేదని అంటారు. ఆది శంకరాచార్యుల గురించి చాలామందికి తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...
ఆది శంకరాచార్య జీవిత విశేషాలు... :
ఆది గురువు శంకరాచార్యను పరమ శివుడి అవతారంగా భావిస్తారు.
క్రీ.శ. 788 సంవత్సరంలో కేరళలోని 'కాలడి' గ్రామంలో ఆది శంకరాచార్యులు జన్మించారు. వైశాఖ శుద్ధ పంచమి రోజున శ్రీమతి ఆర్యాంబ, బ్రహ్మశ్రీ అనే బ్రాహ్మణ పుణ్య దంపతులకు శంకరాచార్యులు జన్మించారు. క్రీ.శ 820 సంవత్సరంలో శివైక్యం పొందారు.
శ్రీమతి ఆర్యాంబ, బ్రహ్మశ్రీ దంపతులకు చాలా ఏళ్లు సంతానం కాలేదు. దీంతో వారు శంకరుడిని ఆరాధించగా... వారి తపస్సుకు సంతోషించిన శంకరుడు కలలో కనిపించి వరం కోరమని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణ దంపతులు శంకరుని సంతాన ప్రాప్తి కలిగించాలని కోరాడు. సర్వజ్ఞుడు, దీర్ఘాయుష్షు కలిగిన సంతానాన్ని కలిగింమని కోరారు.
కుమారునికి దీర్ఘాయుష్షు ఉంటే సర్వజ్ఞుడు కాలేడు, సర్వజ్ఞుడైతే దీర్ఘాయిష్షు ఉండదని పరమ శివుడు ఆ దంపతులతో చెబుతాడు. అప్పుడు ఆ దంపతులు సర్వజ్ఞుడైన సంతానం వరం ఇవ్వమని కోరుతారు. శివుని వరంతో ఆ దంపతులకు కుమారుడు జన్మిస్తాడు. శివుని దయ వలన కలిగిన పుత్రుడు కావడంతో అతనికి శంకర్ అని నామకరణ చేశారు. ఆ బాలుడికి మూడేళ్ల వయసు ఉండగా తండ్రి మరణించాడు.
గురు శంకరాచార్య కేవలం 12 సంవత్సరాల వయస్సులో హిందూ మత గ్రంథాలను అభ్యసించారు.
గురు శంకరాచార్య కేవలం 16 సంవత్సరాల వయస్సులో 100 కంటే ఎక్కువ గ్రంథాలను రచించారు.
లేక లేక కలిగిన సంతానం కావడంతో శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు మొదట తల్లి అంగీకరించలేదు. కానీ ఆ తర్వాత తల్లిని ఒప్పించి ఆయన సన్యాసం స్వీకరించారు.
అద్వైత ప్రచారం కోసం విశేషంగా కృషి చేసిన శంకరాచార్యులు శృంగేరి పీఠము, ద్వారక పీఠము, పూరీ పీఠము, కంచి పీఠము పేరిట దేశానికి నాలుగు దిక్కుల్లో పీఠాలను స్థాపించారు. శ్రీ కంచి కామకోటి పీఠానికి స్వయంగా తానే పీఠాధిపతిగా వ్యవహరించారు.
Also Read: Shehnaaz Gill: సల్మాన్‌తో అంతలా రాసుకుని, పూసుకుని.. తాగిందా లేక... ఆ నటిపై విపరీతమైన ట్రోలింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.