Alcohol Quitting Symptoms: మద్యపానం మానేస్తే శరీరంలో ఏర్పడే మార్పులేంటో తెలుసా..?

Alcohol Quitting Symptoms: మద్యపానం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. కానీ, మద్యం సేవించడాన్ని పూర్తిగా ఆపేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తక్షణమే ఆల్కహాల్ సేవించడం మానేయడం వల్ల ఈ కింది ఆరోగ్య ప్రయోజనాలను దక్కించుకోవచ్చు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 16, 2022, 11:47 AM IST
Alcohol Quitting Symptoms: మద్యపానం మానేస్తే శరీరంలో ఏర్పడే మార్పులేంటో తెలుసా..?

Alcohol Quitting Symptoms: మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు మనశ్శాంతి కోల్పోయి అల్లాడుతున్నాయి. ఆల్కహాల్ వల్ల ఆరోగ్య సమస్యలే కాదు.. మానసిక సమస్యలు, అప్పుల సమస్యలు కూడా వస్తాయి. అలాంటి సమస్యలను దూరం చేసేకునేందుకు వెంటనే మద్యం మానేయండి. ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని అనేక భాగాలు దెబ్బతింటాయి. కాలేయం పనితీరు వృద్ధి చెందదు. కానీ, మద్యపానం ఒక నెల రోజులు మానేస్తే.. మీ శరీరంలో ఏర్పడే సానుకూల మార్పులను మీరు గమనించవచ్చు. 

ఆల్కహాల్‌ డోసును ఎక్కువగా పెంచడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. శరీరంలో ఆల్కహాల్ పెరిగినప్పుడు డీహైడ్రోజినేస్ అనే ఎంజైమ్ ఏర్పడటం వల్ల ఇది కాలేయంలో జీవక్రియకు కారణమవుతుంది. మద్యం తాగడం మానేస్తే శరీరంలో మంచి కొవ్వులు ఏర్పడతాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మద్యాన్ని సేవించే వారికి కాలేయ క్యాన్సర్, రొమ్ము, పెద్దప్రేగు, అన్నవాహిక, తల, మెడ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

మద్యపానం మానేయడం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంది. బరువు తగ్గడం వల్ల అలసట ఉండదు. ఆల్కహాల్ ను సేవించడం వల్ల కాలేయం దెబ్బతినడం, క్యాన్సర్, వాస్కులర్ దెబ్బతినడం, గుండె కండరాలు దెబ్బతినడం, వైవాహిక సమస్యలు, పోషకాహార లోపం, కడుపు నొప్పి వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి ఆల్కహాల్ మానేస్తే శరీర అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.

Also Read: Weight Loss in 15 Days: కేవలం 15 రోజుల్లో బరువు తగ్గాలంటే ఇలా చేయండి!

Also Read: Do Not Google It: ఇకపై గూగుల్ లో వీటి గురించి సెర్చ్ చేస్తే జైలుశిక్ష తప్పదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News