Tips to clean white socks: వేసవి కాలంలో ఎండ, దుమ్ము, మట్టి, చెమట వల్ల బట్టలు నల్లగా మారిపోతాయి. ఏ దుస్తువునైన సులవుగా శుభ్రం చేయవచ్చు కానీ తెలుపు రంగు గల దుస్తువులను శుభ్రం చేయడం చాలా కష్టం. అందులో వైట్ కలర్ సాక్స్‌లను శుభ్రం చేయడం చాలా కష్టం. అయితే, సాక్స్‌లను శుభ్రం చేయడం కూడా అంత కష్టమైన పని కాదని కొందరు చెబుతున్నారు. కొన్ని చిట్కాలను ఉపయోగించి సులవుగా తెలుపు రంగు దుస్తువులను శుభ్రం చేయోచ్చని అంటున్నారు. అది ఎలాగో తెలుసుకుందాం.
ఇలా సులభంగా శుభ్రం చేసుకోండి..
- తెల్లటి సాక్స్‌లను శుభ్రం చేయడానికి.. 1 జగ్ నీటిలో 2 టీస్పూన్ల బేకింగ్ సోడా కలపండి. ఇప్పుడు ఈ నీటిలో సాక్స్‌లను 2 గంటలు నానబెట్టండి. తర్వాత సాక్స్‌లను తీసి చేతులతో రుద్దాలి. ఇలా చేస్తే సాక్స్‌లు పూర్తిగా శుభ్రమవుతాయి.
-నిమ్మకాయను ఉపయోగించి కూడా సాక్స్‌లను శుభ్రం చేయోచ్చు..దీని కోసం 3-4 గ్లాసుల వెచ్చని నీటిలో అర కప్పు నిమ్మరసం, డిష్ సోప్ కలపండి. ప్పుడు ఈ నీటిలో సాక్స్ వేసి 20 నిమిషాలు ఉడకబెట్టండి. దీని తరువాత, డిటర్జెంట్‌తో కడగండి. ఆ తర్వాత సాక్స్‌లను నీటితో శుభ్రం చేయండి.
- వెనిగర్ సహాయంతో కూడా సాక్స్‌లను శుభ్రం చేయవచ్చు. దీని కోసం 2 కప్పుల నీటిని మరిగించి, దానికి 1 కప్పు వైట్ వెనిగర్ వేయాలి. ఇప్పుడు అందులో సాక్స్‌ను నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయం వాటిని మంచి నీటితో శుభ్రం చేయండి.
- సాక్స్‌ల జిడ్డును తొలగించడానికి గోరువెచ్చని నీటిలో 4 టీస్పూన్ల బ్లీచింగ్ పౌడర్, 1 టీస్పూన్ డిష్ సోప్‌ను కలపండి. ఈ మిశ్రమంలో సాక్స్‌లను 20 నిమిషాలు నానబెట్టండి. ఇప్పుడు సాక్స్‌లను మామూలుగా కడగాలి.
- డిష్ డిటర్జెంట్ సహాయంతో సాక్స్‌లను శుభ్రం చేసుకోవచ్చు. దీని కోసం, 1 జగ్ నీటిలో డిష్ డిటర్జెంట్ కలపండి, కలిపి వాటి అందులో నానబెట్టండి. రాత్రంతా నానబెట్టిన తర్వాత, ఉదయాన్నే సాక్స్‌లను స్క్రబ్బింగ్ చేసి.. వాటిలో కడగండి.
Also Read: Mulberry For Health: మల్బరీ తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!
Also Read: Aluminum Foil Benefits: అల్యూమినియం ఫాయిల్‌తో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook