Fighter Jets: భారత అమ్ములపొదిలో త్వరలో 114 ఆధునిక యుద్ధ విమానాలు, శత్రు దేశాలకు కలవరమే

Fighter Jets: ఇండియా త్వరలో గగనతలంపై పైచేయి సాధించే ప్రయత్నంలో ఉంది. శత్రుదేశాలైనా చైనా, పాకిస్తాన్‌లకు ఇది కలవరమే. ఇండియా భారీగా యుద్ధ విమానాల తయారీకు సిద్ధమౌతుండటమే దీనికి కారణం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 12, 2022, 09:35 PM IST
Fighter Jets: భారత అమ్ములపొదిలో త్వరలో 114 ఆధునిక యుద్ధ విమానాలు, శత్రు దేశాలకు కలవరమే

Fighter Jets: ఇండియా త్వరలో గగనతలంపై పైచేయి సాధించే ప్రయత్నంలో ఉంది. శత్రుదేశాలైనా చైనా, పాకిస్తాన్‌లకు ఇది కలవరమే. ఇండియా భారీగా యుద్ధ విమానాల తయారీకు సిద్ధమౌతుండటమే దీనికి కారణం.

ఇండియాకు పక్కలో బెళ్లెంలా ఉన్నాయి పాకిస్తాన్, చైనా దేశాలు. సరిహద్దుపై ఈ రెండు దేశాలు చేసే కవ్వింపు చర్యలు సర్వ సాధారణంగా మారాయి. ఈ రెండు దేశాల్నించి పొంచి ఉన్న ముప్పు నేపధ్యంలో ఇండియా ఎప్పటికప్పుుడు సైనిక, ఆయుధ శక్తిని పటిష్టపర్చుకుంటోంది. ఇప్పుడు వైమానికంగా అంటే గగనతలంలో ఆ రెండు ప్రత్యర్ధి దేశాలపై పైచేయి సాధించే ప్రయత్నం చేస్తోంది. 

ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో ఆధునిక యుద్ధ విమానాల కోసం ఏకంగా 1.5 లక్షల కోట్లు వెచ్చించనుంది ఇండియా. ఈ ఖర్చుతో సొంతంగా 114 ఆధునిక యుద్ధ విమానాలు సమకూర్చుకోవాలని ఇండియా ఆలోచిస్తోంది. ఇందులో 96 విమానాల్ని స్వయంగా ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా తయారు చేసుకోనుంది. మరో 18 యుద్ధ విమానాల్ని మాత్రం విదేశాల్నించి దిగుమతి చేసుకోనుంది. బై గ్లోబల్-మేకిన్ ఇండియా పథకంలో భాగంగా ఈ 114 యుద్ద విమానాలు సమకూర్చుకోనుంది ఇండియా. ఇందులో భాగంగా విదేశీ సంస్థలతో కూడా భాగస్వామ్యమయ్యేందుకు వీలుంటుంది. ముందుగా 18 యుద్ధ విమానాల్ని విదేశాల్నించి దిగుమతి చేసుకుంటారు. ఆ తరువాత 36 విమానాల్ని ఇండియాలోనే తయారు చేస్తారు. మిగిలిన 60 విమానాలు రెండవ దశలో తయారు చేస్తారు. 

ఇప్పటికే గత ఏడాది ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలు ఇండియా అమ్ములపొదిలో చేరి..వైమానిక దళ సామర్ధ్యాన్ని పెంచాయి. మిగ్ సిరీస్ విమానాలు పాతవి అయిపోవడంతో కొత్తవాటితో భర్తీ చేయాలనేది భారత వైమానిక దళం ఆలోచన. దీనికోసం ఫిఫ్త్ జనరేషన్ అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలు సమీకరించుకోవల్సి ఉంది. భవిష్యత్తులో రఫేల్ తరహా యుద్ధ విమానాల రూపకల్పన కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

Also read: Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాల రాకకు వేళాయే..ఇక భారీ వర్షాలే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News