Agnipath: చాయ్ అమ్మిన వ్యక్తిని ప్రధానిని చేస్తే.. ఆర్మీని అడ్డమీది కూలీలా మార్చేశారు! రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్..

Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చంచల్ గూడ జైలుకు వెళ్లారు. పార్టీ నేతలు అంజన్ కుమార్ యాదల్, మల్లురవితో కలిసి జైలుకు వెళ్లిన రేవంత్ రెడ్డి.. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో రిమాండ్ లో ఉన్న యువకులను కలిశారు.

Written by - Srisailam | Last Updated : Jun 24, 2022, 01:19 PM IST
  • చంచల్ గూడ జైలుకు వెళ్లిన రేవంత్ రెడ్డి
  • రిమాండ్ లో ఉన్న నిందితులకు పరామర్శ
  • మోడీ సర్కార్ పై రేవంత్ రెడ్డి నిప్పులు
Agnipath: చాయ్ అమ్మిన వ్యక్తిని ప్రధానిని చేస్తే.. ఆర్మీని అడ్డమీది కూలీలా మార్చేశారు! రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్..

Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చంచల్ గూడ జైలుకు వెళ్లారు. పార్టీ నేతలు అంజన్ కుమార్ యాదల్, మల్లురవితో కలిసి జైలుకు వెళ్లిన రేవంత్ రెడ్డి.. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో రిమాండ్ లో ఉన్న యువకులను కలిశారు. ఆర్మీ అభ్యర్థలను పరామర్శించి.. వారి సమస్యలు తెలుసుకున్నారు. న్యాయపరంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రిమాండ్ లో ఉన్న యువకులకు హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీనే లాయర్లను నియమిస్తుందని చెప్పారు.

చంచల్ గూడ జైలులో ఆర్మీ అభ్యర్థులను కలిశాకా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ పథకంపైనా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, మోడీ ఆనాలోచిత నిర్ణయాలతో దేశ భధ్రత, యువత భవిష్యత్  ప్రశ్నార్ధకంగా మారిందన్నారు రేవంత్ రెడ్డి. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి ఏటా 60 వేల మందిని ఆర్మీలో రిక్రూట్ చేయడం జరుగుతుందన్నారు. కాని మోడీ సర్కార్ రెండేళ్లుగా ఆర్మీ నియామకాలు చేపట్టలేదన్నారు.అగ్నిపథ్ పథకాన్ని హడావుడిగా తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అత్యంత కీలకమైన అంశంలో పార్లమెంట్ లో చర్చించకుండానే నాలుగు సంవత్సరాలకోసం రిక్రూట్ చేసే విధానం నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

అగ్నిపథ్ తో దేశ భధ్రత కు ముప్పు ఏర్పడుతుందనే భయంతోనే దేశ యువత ఆందోళనలు చేస్తోందన్నారు రేవంత్ రెడ్డి. మోడీ సర్కార్ తీరుతో అడ్డమీది కూలీలా ఆర్మీ తయారయ్యే పరిస్థితి ఉందన్నారు. భవిష్యత్ భధ్రత లేకుండా అగ్నిపథ్ తీసుకొచ్చారని విమర్శించారు. రెండు సంవత్సరాల ట్రైనింగ్ లో  నేర్చుకోవాల్సింది.. 6 నెలల ట్రైనింగ్ ఇస్తే.. సమర్దులు అయిన ఆర్మీ ఆఫీసర్ ఎలా తయారవుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సైనికులకు ఉద్యోగ భధ్రత లేకపోతే దేశ భధ్రత కు ప్రమాదం ఏర్పడుతుందని చెప్పారు. దేశ భధ్రత దృష్ట్యా అగ్నిపథ్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని  రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో పరీక్ష రాసిన ఆర్మీ అభ్యర్థులకు వెంటనే తదపరి పరీక్షలు పెట్టి  రిక్రూట్ చేయాలన్నారు. 2020లో  నోటిఫికేషన్ ఇచ్చి ఇంతవరకు రాత పరీక్ష పెట్టలేదని అన్నారు. ఆర్మీ అభ్యర్థులలో ఎక్కువ మంది ఎస్సీ , ఎస్టీ ,బీసీ పిల్లలే ఎక్కువగా ఉన్నారన్నారు. జైలులో రిమాండ్ లో ఉన్న వారికి సంబంధించి చాలా మంది తల్లిదండ్రులకు వారి పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియదని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఆర్మీ అభ్యర్థులపై హత్యాయత్నం కేసు లు నమోదు చేశారని, భవిష్యత్ లో ఉధ్యోగాలు రాకుండా నాన్ బెయిల్ కేసులు పెట్టారని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తాము విధ్వంసాలకు పాల్పడలేదని రిమాండ్ లో ఉన్న ఆర్మీ అభ్యర్థులు చెబుతాన్నారని చెప్పారు. ఇంతమంది పై ఇంత  గుడ్డిగా 307ఐపీసీ కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. చాయ్ అమ్ముకునే వ్యక్తి ని ప్రధానిని చేస్తే.. దేశ యువతకు నరేంద్ర మోడీ ఇచ్చే నజరానా ఇదేనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. అగ్నిపథ్ ను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. ఆర్మీ అభ్యర్థుల పై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ నిజ స్వరూపం ఇప్పుడు బయటపడుతుందన్నారు రేవంత్ రెడ్డి. గోపాలపురం పోలిస్ స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థుల పై రెండు కేసులు నమోదు చేశారని చెప్పారు. రాకేష్ మరణం మొసలి కన్నీరు కార్చిన టిఆర్ఎస్.. ఆర్మీ అభ్యర్థులపై ఎందుకు కేసులు పెట్టిందని పీసీసీ చీఫ్ నిలదీశారు. కేసులు అయిన ఆర్మీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ న్యాయ సహాయం చేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం  పెట్టిన కేసులు ఉపసంహరించడంతో పాటు  రాష్ట్ర ప్రభుత్వమే న్యాయ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రైల్వే పోలీసులు స్పెషల్ కోర్ట్ ఏర్పాటు చేసి 40రోజులలో కేసులు ముగించాలన్నారు.

Read also: Goose Bumps Video: ప్రాణాలకు తెగించి పట్టాలపై వ్యక్తిని కాపాడిన రైల్వే ఉద్యోగి.. రెండ్లు సెకన్లు లేటైతే అంతే సంగతి..!

Read also: APOSS RESULTS: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల.. మార్కులు ఇలా చెక్ చేసుకోండి..   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x