TS Eamcet Hall Tickets 2022: తెలంగాణ ఎంసెట్ హల్ టికెట్లు విడుదలయ్యాయి. జూలై నెలలో జరగనున్న ఎంసెట్ పరీక్షల హాల్‌టికెట్లను అధికారిక వెబ్సైట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం..
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలు జూలై 18, 19, 20 తేదీల్లో జరగనున్నాయి. జూలై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ పరీక్షలు జరగనుండగా..18, 19,20 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణ ఎంసెట్ అధికారిక వెబ్సైట్ eamcet.tsche.ac.in వెబ్సైట్ ద్వారా విద్యార్దలుు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ హాల్‌టికెట్లు జూలై 11వ తేదీ వరకూ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
టీఎస్ ఎంసెట్ పరీక్షలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ పూర్తయినప్పటికీ..లేట్ ఫీజు 27 వందలతో జూలై 7వరకూ అవకాశముంది. హాల్‌టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ముందుగా అధికారిక వెబ్సైట్ eamcet.tsche.ac.in ఓపెన్ చేసి..వెబ్సైట్ హోంపేజ్‌లో వెళ్లి..హాల్‌టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ నమోదు చేసి సబ్మిట్ చేయాలి. స్క్రీన్‌పై మీ హాల్‌టికెట్ ప్రత్యక్షమవుతుంది. వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోండి. వెంటనే ప్రింట్ అవుట్ తీసి ఉంచుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి