మెగా ఫ్యామిలీని ఎవ్వరూ విడుగొట్టలేరు: అల్లు అర్జున్

ఇంటి నుంచి ఎందరు హీరోలోచ్చినా.. మెగా కుటుంబం ఒక్కటే అని అల్లు అర్జున్ చెప్పారు.

Last Updated : Apr 23, 2018, 04:13 PM IST
 మెగా ఫ్యామిలీని ఎవ్వరూ విడుగొట్టలేరు: అల్లు అర్జున్

ఇంటి నుంచి ఎందరు హీరోలొచ్చినా.. మెగా కుటుంబం ఒక్కటే అని అల్లు అర్జున్ చెప్పారు. అల్లు హీరోగా నటిస్తున్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం మిలటరీ మాధవరం ఊరిలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర సమర్పకులు నాగబాబు ఆడియో సీడీని రిలీజ్ చేశారు. వక్కంతం వంశీ ఈ సినిమాకి డైరెక్టర్ కాగా, లగడపాటి శ్రీధర్‌ నిర్మాత. బన్నీవాసు సహ నిర్మాత. అనూ ఇమ్మాన్యూయేల్‌ హీరోయిన్ గా నటించింది. విశాల్‌ శేఖర్‌ సంగీతాన్ని అందించాడు. ఈ ఆడియో విడుదల వేడుకలో  అల్లు అర్జున్‌ ఉద్వేగంగా మాట్లాడారు.

రాజకీయాల్లోకి మావయ్య పవన్‌ రాగానే ఎవరెవరో ఏవేవో మాట్లాడుతున్నారని, టీవీలు ఉన్నాయని ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ ప్రజారాజ్యం నుంచే అలవాటయ్యాయని విమర్శలు వినీ వినీ మనసు బండరాయిలా మారిపోయిందని అన్నారు. 'ఈ మధ్య వ్యక్తిగతంగా తీవ్రమైన దూషణలు చేశారు. చేసిన వాళ్లది తప్పయితే, చేయించిన వాళ్లది ఇంకా పెద్ద తప్పు' అని అన్నారు. చిత్ర పరిశ్రమలో నెంబర్‌ వన్‌గా ఉండి పవన్‌ రాజకీయాల్లోకి వచ్చారని, సినిమాలు లేక కాదని బావోద్వేగంతో మాట్లాడారు. హీరోకి ఉండే అన్ని సౌఖ్యాలు వదులుకొని ప్రజల కోసం వచ్చాడని అన్నారు.

Trending News