Service Charge; హోటల్స్, రెస్టారెంట్స్‌లో సర్వీస్ చార్జీలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఏ కీలక ప్రకటనను సోమవారం విడుదల చేసింది.
Service Charge Ban: హోటల్స్, రెస్టారెంట్స్‌లో సర్వీస్ ఛార్జ్ బాదుడు నుంచి ఉపశమనం కలిగించేలా కీలక ఆదేశాలు వెలువడ్డాయి. బిల్లో ఆటోమెటిక్‌గా సర్వీస్ ఛార్జ్ వేయడాన్ని నిషేధించింది సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. నిబంధనలు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక నంబర్ అందుబాటులోకి తెచ్చింది. సర్వీస్ ఛార్జ్ విషయంలో ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సీసీపీఏ ఈ మేరకు చర్యలు తీసుకుంది. హోటల్స్, రెస్టారెంట్లు బిల్స్ వేయడంపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించింది