IRCTC Ticket Booking: రైల్వే టికెట్ బుకింగ్ విషయంలో చాలామందికి ఇబ్బందులెదురవుతుంటాయి. ఆ ఇబ్బందుల్ని తొలగించేలోగా టికెట్లు అయిపోతుంటాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే..కన్ఫార్మ్ టికెట్ సులభంగా పొందవచ్చు. ఆ చిట్కాలేంటో చూద్దాం..
రైల్వే టికెట్ బుక్ చేసేటప్పుడు ఆలస్యం అమృతం విషం లాంటి పరిస్థితి ఎదురౌతుంది. కొద్దిగా ఆలస్యమైనా టికెట్లు దొరకవు. తత్కాల్ టికెట్ విషయంలో ఇంకా ఇబ్బంది. క్షణాల తేడాలో టికెట్లు అయిపోతాయి. అందుకే కొన్ని పద్దతులు పాటిస్తే టికెట్ బుకింగ్‌లో ఆలస్యం అవదు. టికెట్ కూడా సులభంగా లభిస్తుంది. రైల్వే టికెట్ బుక్ చేసేటప్పుడు కొన్ని విషయాల్ని దృష్టిలో పెట్టుకుంటే చాలు. ఐఆర్సీటీసీ యాప్‌లో ఒక ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు..అదెలాగో చూద్దాం..
రైల్వే టికెట్ బుకింగ్‌లో ఆలస్యం ఉండకుండా ఉండాలంటే..ముందు మీ ఇంటర్నెట్ స్పీడ్ ఉండాలి. లేకపోతే సైట్ ఓపెన్ కావడంలో..ఇతర ప్రక్రియకు ఆలస్యమైపోతుంది. తత్కాల్ టికెట్ బుక్ చేసేటప్పుడు నిర్ధారిత సమయంలో ఆన్లైన్లో ఉండాలి. ఏసీ తత్కాల్ టికెట్ బుకింగ్ 10 గంటలకు ఉంటుంది. అందుకే రెండు నిమిషాల ముందు అంటే 9 గంటల 58 నిమిషాలకే లాగిన్ అయుండాలి. స్లీపర్ తరగతిలో తత్కాల్ బుకింగ్ సమయం 11 గంటలకైతే..10.58 నిమిషాలకే లాగిన్ కావాలి. లాగిన్ అయిన వెంటనే తత్కాల్ కౌంటర్ ఓపెన్ అవకముందే మాస్టర్ లిస్ట్ సిద్ధం చేసుకోవాలి.
తత్కాల్ టికెట్ బుకే చేసేటప్పుడు సాధారణంగా పరిమితమైన సీట్లే ఉంటాయి. అందులో కొన్ని వ్యక్తిగత విషయాలు భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలి. ఫిల్ చేసేందుకు కొద్దిగా సమయం వృధా కావచ్చు. అందుకే మాస్టర్ లిస్ట్ అనేది పనికొస్తుంది. మాస్టర్ లిస్ట్‌లో ఒకవేళ మీరు ముందే అవసరమైన సమాచారాన్ని నింపి ఉంటే..టికెట్ బుకింగ్ సమయంలో టైమ్ కలిసొస్తుంది. పేరుపై క్లిక్ చేయగానే..మీ వివరాలన్నీ వచ్చేస్తాయి. దానిపై క్లిక్ చేస్తే ఆటో ఫిల్ అయిపోతుంది. మీ సమయం వృధా కాదు.
ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌పై మై ప్రొఫెల్ సెక్షన్లో మాస్టర్ లిస్ట్ సిద్ధం చేసుకోవాలి. పేరు, వయస్సు, ఐడీ కార్డు నెంబర్, భోజనం, బర్త్ ఛాయిస్ వంటి వివరాలతో పాటు పాసెంజర్ వివరాలతో జాబితా తయారు చేసుకోవాలి. యూపీఐ, ఐఆర్చీసీటీ వాలెట్ లేదా ఇతర ఏ పేమెంట్ మోడ్ అయినా సరే వినియోగించవచ్చు. అయితే బ్యాలెన్స్ కావల్సినంత ఉందో లేదో ఒకసారి సరి చూసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook