Droupadi Murumu:భారత 15వ రాష్ట్రపతి గిరి పుత్రిక ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై ఆమె ఘన విజయం సాధించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము... యశ్వంత్ సిన్హాపై 2,96,626 ఓట్ల తేడాతో గెలిచారు. చెల్లిన ఓట్లలో ద్రౌపది ముర్ముకు 64.03 శాతం ఓట్లు రాగా... యశ్వంత్ సిన్హాకు 35.97 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 4 వేల 754 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 4,701 ఓట్లు చెల్లగా.. ముర్ముకు 2824 ఓట్లు పడ్డాయి. యశ్వంత్ సిన్హాకు 1877 ఓట్లు మాత్రమే వచ్చాయి. విపక్షాలకు చెందిన 17 మంది ఎంపీలు, 125 మంది ఎమ్మెల్యేలు ద్రౌపది ముర్ముకు మద్దతుగా క్రాస్ ఓటింగ్ చేశారు. సిన్హాపై ఘన విజయంతో దేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు సాధించారు.
ఇప్పటివరకు దేశానికి 14 మంది రాష్ట్రపతులుగా పనిచేశారు. ముర్ము ఎన్నికకు ముందు జరిగిన ఎన్నికల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ అత్యధిక ఓట్లు సాధించారు. రెండో రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకంగా 98.2 శాతం ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇక వివి గిరి మాత్రం కేవలం 50.9 శాతం ఓట్లు మాత్రమే సాధించి ప్రెసిడెంట్ గా గెలిచారు. ఆ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం సంజీవ రెడ్డి పోటీ చేయగా.. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మాత్రం వీవీ గిరికి మద్దతు ఇచ్చారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థిపై స్వల్ప మెజార్టీతో గెలిచారు వీవీ గిరి. ఇక దేశానికి మొదటి రాష్ట్రపతిగా డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆరవ రాష్ట్రపతిగా రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఇక మిగిలిన అన్నిసార్లు ఎన్నికలు జరిగాయి.
రెండో రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ 98.2 శాతం ఓట్లు సాధించగా.. మూడో రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ 56.2 శాతం ఓట్లు సాధించి గెలిచారు. నాలుగో రాష్ట్రపతిగా విజయం సాధించిన వివి గిరికి కేవలం 50.9 శాతం ఓట్లు వచ్చాయి. ఐదో రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ 78.9 శాతం ఓట్లు సాధించి గెలుపొందారు. ఇక ఏడో రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ 72.7 శాతం ఓట్లు సాధించారు. ఎనిమిదో రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ కు 72.3 శాతం ఓట్లు పోలయ్యాయి. తొమ్మిదో రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ 65.9 శాతం ఓట్లు రాగా.. పదో రాష్ట్రపతిగా గెలిచిన కెఆర్ నారాయణన్ కు ఏకంగా 95 శాతం ఓట్లు వచ్చాయి. పదకొండో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 89.6 శాతం పన్నెండో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 65.8 శాతం 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 69.3 శాతం ఓట్లతో గెలిచారు. 2017లో జరిగిన 14వ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 65.7 శాతం ఓట్లు సాధించి విజయం సాధించారు.
Also Read: Droupadi Murmu Becomes President: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఘన విజయం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook