Telangana Rains LIVE* Updates: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కుండపోత వాన... ఆ జిల్లాలకు ఇవాళ భారీ వర్ష సూచన

Telangana Rains LIVE* Updates: తెలంగాణను వర్షాలు ముంచెత్తుతూనే ఉన్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. పగటిపూట అక్కడకక్కడా తేలికపాటి జల్లులు పడగా అర్ధరాత్రి భారీ వాన దంచికొట్టింది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 26, 2022, 03:16 PM IST
Telangana Rains LIVE* Updates: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కుండపోత వాన... ఆ జిల్లాలకు ఇవాళ భారీ వర్ష సూచన
Live Blog

Telangana Rains LIVE* Updates: తెలంగాణను వర్షాలు ముంచెత్తుతూనే ఉన్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. పగటిపూట అక్కడకక్కడా తేలికపాటి జల్లులు పడగా అర్ధరాత్రి భారీ వాన దంచికొట్టింది.హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముషీరాబాద్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొత్తపేట, మలక్‌పేట, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్, చంపాపేట్, చాదర్‌ఘాట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉంది. రాబోయే కొద్దిగంటల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి సహా కొన్ని జిల్లాల్లోతేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఇవాళ భారీ వర్ష సూచన ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాలపై లైవ్‌ అప్‌డేట్స్ మీకోసం.. 
 

26 July, 2022

  • 15:16 PM

    భారీ వర్షాలకు గండిపేట జలాశయానికి వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 6 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువన మూసీలోకి విడుదల చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.

  • 14:44 PM

    వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డేట్

    ఆదిలాబాద్, ఆసిఫాబాద్,మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.

  • 13:31 PM

    తూర్పు రాజస్థాన్ పరిసర ప్రాంతం నుండి మధ్యప్రదేశ్, తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి పశ్చిమ మధ్య బంగాళా ఖతం వరకు  కొనసాగుతున్న ద్రోణి..
    సగటు సముద్ర మట్టం నుండి 1.5 కి మీ నుండి 3.1 కి.మీ మధ్య  ద్రోణి వ్యాపించి  ఉంది.

    ద్రోణి ప్రభావంతో   ఈ రోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో  తేలికపాటి  నుండి ఒక మోస్తరు వర్షములు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి  తెలంగాణా రాష్ట్రంలో  తేలికపాటి  నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. 

  • 11:01 AM

    హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ 513.41 మీ.
    ఇవాళ ఉదయం 10.30 గంటల వరకు సాగర్‌లో నీటి మట్టం 513.48 మీ.
    ఔట్ ఫ్లో 1795.56 క్యూసెక్కులు 

  • 10:59 AM

    హిమాయత్‌సాగర్‌కు భారీ వరద...

    ఉదయం 11 గంటలకు మరో గేటు ఎత్తనున్న అధికారులు...

    ప్రస్తుతం అవుట్ ఫ్లో 660 క్యూసెక్కులు 

  • 10:58 AM

    మరో మూడు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన... పలు జిల్లాల్లో భారీ వర్షాలు...

     

  • 10:57 AM

    వాతావరణశాఖ లేటెస్ట్ అప్‌డేట్...

    ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అర్ట్..

  • 08:45 AM

    అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి సరూర్ నగర్ చెరువు నుంచి వరద నీరు సమీప కాలనీల్లోకి చేరింది. 
     

  • 08:44 AM

    హైదరాబాద్‌లో భారీ వర్షాలకు సరూర్ నగర్ చెరువు నుంచి సమీప కాలనీల్లోకి చేరిన వరద నీరు..

Trending News