August Rashifal: గ్రహాలు శుభ ప్రభావం.. ఆగష్టు 1 నుండి ఈ రాశులవారిపై డబ్బే డబ్బు!

Effect of Planetary Motion: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఆగస్టు నెల కొన్ని రాశులవారికి శుభ్రపదంగా ఉండనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 30, 2022, 09:21 AM IST
  • గ్రహ గమనం వల్ల లాభాలు
  • ఆగస్టు నుంచి నాలుగు రాశులపై శుభ ప్రభావం
  • ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది
August Rashifal: గ్రహాలు శుభ ప్రభావం.. ఆగష్టు 1 నుండి ఈ రాశులవారిపై డబ్బే డబ్బు!

Auspicious Effects on thease Zodiac: ఆస్ట్రాలజీ ప్రకారం, ఏ మనిషి జీవితంలోనైనా గ్రహాల గమనం చాలా ముఖ్యమైనది. గ్రహాల కదలిక వల్ల వివిధ రాశుల వారిపై శుభం లేదా అశుభ ప్రభావం ఉంటుంది. మరో రెండు రోజుల్లో ఆగస్టు నెల ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో (August Horoscope) ఏ రాశులవారు శుభవార్తలు వింటారో? ఏ రాశులవారికి అదృష్టం మారబోతుందో? ఇప్పుడు తెలుసుకుందాం. 

మిధునం (Gemini): మిథున రాశి వారికి రానున్న మాసం శుభప్రదంగా ఉండనుంది. ఈ రాశివారికి కుటుంబం, స్నేహితుల సహకారం ఉంటుంది. కొత్త జాబ్ వస్తుంది. ఉద్యోగులు పదోన్నతులు సాధిస్తారు. 

కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి ఆగష్టు నెల అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

కన్య (Virgo): ఈ వారికి ఆగష్టు నెల అద్భుతంగా ఉండనుంది. ఈ కాలంలో ఈ రాశివారు మతపరమైన యాత్ర చేసే అవకాశం ఉంది. పాతమిత్రులను కలుస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే.. ఈ సమయంలో కుదుటుపడుతుంది.  

మకరం (Capricorn): ఈ రాశి విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఉన్నత చదువుల కోసం కుటుంబానికి దూరంగా వెళ్లే  అవకాశం ఉంది. వీరికి ఆగస్ట్ 17లోపు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆగస్ట్ 24 తర్వాత ఈ రాశివారు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. 

Also Read: Sun and Venus transit Effect: కర్కాటకంలో సూర్య, శుక్ర గ్రహాలు, ఆగస్టు 7 నుంచి ఆ మాడు రాశులకు అంతా శుభమే

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News