Nithiin's Macherla Niyojakavargam movie Trailer out: టాలీవుడ్ యువ హీరో నితిన్ ప్రాధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ప్రముఖ ఎడిటర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో గ్లామర్ డాల్స్ కృతీ శెట్టి, కేథరిన్ థ్రేసా కథానాయికలుగా నటిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది.
మాచర్ల నియోజకవర్గం సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది. 3 నిమిషాల 3 సెకండ్ల నిడివి గల ఈ ట్రైలర్.. 'ఇవాళ వైజాగ్ చాలా ప్రశాంతంగా ఉంది' అనే డైలాగ్‌తో ఆరంభం అయింది. ఎప్పుడులేంది నన్ను బయటకి తీసుకొచ్చి సబ్వే తినిపిస్తున్నావ్.. సబ్జెక్ట్ ఏంటీ, వాడు నిన్ను టచ్ చేసినా పట్టించుకోను గానీ వాడు నా ఈగోను టచ్ చేశాడు, ఈ రాజప్ప మీద గెలవాలంటే రాజప్పే అయ్యుండాలి, కలెక్టర్ మీద చెయ్యేస్తే గవర్నమెంట్ మీద చెయ్యేసినట్టే, రాజప్ప వీరప్ప తొక్కప్ప బొంగప్ప.. ఎవడికైనా ఇదే పనిష్మెంట్ అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
ఎంటర్ టైన్మెంట్తో పాటు యాక్షన్‌ను మేళవించి మాచర్ల నియోజకవర్గం సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్‌లోని డైలాగ్‌లు, నితిన్ యాక్షన్ సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. ఈ సినిమాలో నితిన్ కలెక్టర్‌గా నిటిస్తున్న విషయం తెలిసిందే. సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు పెరగ్గా.. గ్లింప్స్, పోస్టర్స్, ట్రైలర్ వాటిని రెట్టింపు చేశాయి. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన 'రారా రెడ్డి' అనే సాంగ్ అయితే నెట్టింట దూసుకు పోతోంది.
Also Read: Nookaraju: క్యాష్ షోలో షాకింగ్ ఘటన.. చేతిలో కర్పూరం హారతి… తాళి కట్టేందుకు విఫలయత్నం!
Also Read: Commitment Movie: వివాదంలో కమిట్మెంట్ మూవీ.. కేసు నమోదు..ధ్వంసం చేస్తామంటూ హెచ్చరిక!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook