Gold Price Today August 2: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధర! హైదరాబాద్‌లో నేటి ధరలు ఇవే

August 2nd 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,380గా ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 2, 2022, 08:52 AM IST
  • తగ్గిన బంగారం ధర
  • నేటి బంగారం, వెండి రేట్లు ఇవే
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఎంతంటే
Gold Price Today August 2: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధర! హైదరాబాద్‌లో నేటి ధరలు ఇవే

Gold Price Today 2022 August 2: బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. ఒక రోజు పసిడి రేటు పెరిగితే.. మరో రోజు తగ్గుతాయి.. ఇంకోరోజు మాత్రం స్థిరంగా ఉంటాయి. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, వివిధ దేశాల భౌతిక పరిస్థితులు, డాలర్ విలువ లాంటి పరిణామాలు పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అయితే బంగారం ధరలు పెరిగినా, తగ్గినా.. వ్యాపారాలు మాత్రం జోరుగానే ఉంటాయి.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ఇటీవల తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. 4-5 రోజులుగా పెరుగుతూ వచ్చాయి. అయితే గత రెండు రోజులుగా మాత్రం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం (ఆగష్టు 2) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 47,100లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,380లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 100.. 24 క్యారెట్ల ధరపై రూ. 110 తగ్గాయి.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,550గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 47,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,380గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,950గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,300 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,150.. 24 క్యారెట్ల ధర రూ. 51,430గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 47,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,380గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,380గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 47,100 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,380గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 47,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,380 వద్ద కొనసాగుతోంది. మరోవైపు ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 58,000లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.400 తగ్గింది. హైదరాబాద్‌లో నేడు కిలో వెండి ధర రూ. 63,300లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ. 63,300లుగా కొనసాగుతోంది. 

Also Read: Uma Maheshwari Cremation Updates: ఉమా మహేశ్వరి అంత్యక్రియలకు తారక్ రావడం లేదా ?

Also Read: Viral Video: తల్లి మృతదేహం బైక్‌పై ఒళ్లో పెట్టుకుని తీసుకెళ్తున్న హృదయ విదారక దృశ్యం

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News