Deepawali 2022: హిందూ మతంలో ఉన్నటువంటి పండుగలు మరే ఏ మతంలోనూ ఉండవు. ప్రతి నెల ఏదో ఒక ఫెస్టివల్ ఉంటూనే ఉంటుంది. ఈ కోవలోకే వస్తుంది దీపావళి. అయితే ఈ పండుగను మాత్రం కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు. సాధారణంగా దీపావళిను (Deepawali 2022) కార్తీక మాసం అమావాస్య రోజున జరుపుకుంటారు. ఇది ఐదు రోజుల పండుగ. రావణుడిని సంహరించి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా అక్కడి ప్రజలు ఈ పండుగను జరుపుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. 2022లో దీపావళి ఎప్పుడు మరియు దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.
దీపావళి 2022 తేదీ
హిందూ క్యాలెండర్ ప్రకారం, కార్తీక మాసంలోని అమావాస్య రోజున దీపావళి జరుపుకుంటారు. ఈ ఏడాది కార్తీక మాసం అమావాస్య అక్టోబర్ 24 మరియు 25 తేదీలలో ఉంటుంది. అయితే అక్టోబర్ 25న ప్రదోష కాలానికి ముందు అమావాస్య ముగుస్తుంది. అందుకే దీపావళి పండుగ అక్టోబర్ 24, 2022 న జరుపుకుంటారు.
శుభ ముహూర్తం
పంచాంగం ప్రకారం, అక్టోబర్ 23, త్రయోదశి తిథి సాయంత్రం 6.04 వరకు ఉంటుంది. ఆ తర్వాత చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. చతుర్దశి తిథి అక్టోబర్ 24 సాయంత్రం 5:28 గంటలకు ముగుస్తుంది. దీని తరువాత అమావాస్య తేదీ ప్రారంభమవుతుంది. అమావాస్య తిథి అక్టోబర్ 25 సాయంత్రం 4.19 వరకు ఉంటుంది.
దీపావళి ప్రాముఖ్యత
చెడుపై మంచి సాధించిన విజయంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. లంకాథిపతి రావణుని శ్రీరాముడు జయించి...14 సంవత్సరాల వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చాడు. శ్రీరాముడు అయోధ్యకు చేరుకున్నాడన్న ఆనందంతో అయోధ్య నగరమంతా దేదీప్యమానంగా వెలిగిపోయింది. రాముడికి స్వాగతం పలికేందుకు ప్రజలు తమ ఇళ్లలో దీపాలు వెలిగించారు.
Also Read: Naga Panchami 2022: నాగ పంచమి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook