Rakshabandhan 2022: రక్షాబంధన్ సమీపిస్తోంది. ఎప్పటిలానే ఇప్పుడు కూడా సందిగ్దం కల్గిస్తోంది. ఆగస్టు 11 లేదా 12 రెండింట్లో ఏ రోజు రక్షాబంధన్ అనే విషయంపై అయోమయం నెలకొంది. సరైన తేదీ ఎప్పుడో తెలుసుకుందాం..
శ్రావణమాసం పౌర్ణిమ తిధి నాడు రక్షాబంధన్ జరుపుకోవడం ఆనవాయితీ. రక్షాబంధన్ రోజున చెల్లెళ్లు..తమ సోదరుల చేతికి రాఖీ కడుతారు. అంతేకాకుండా సోదరుని దీర్ఘాయుష్షు కోసం ప్రార్ధిస్తారు. అందుకు బదులుగా అన్న లేదా తమ్ముడు చెల్లెలికి రక్షణగా ఉంటానని మాటిస్తాడు. ఈసారి కూడా ఎప్పటిలానే రక్షాబంధన్ లేదా రాఖీ ఎప్పుడనే విషయంపై సందిగ్దత ఏర్పడింది. రక్షాబంధన్ తిధి విషయంలో జనంలో సందేహాలున్నాయి. కొంతమంది ఆగస్టు 11 అంటుంటే..మరి కొంతమంది ఆగస్టు 12న అంటున్నారు. అసలు రక్షాబంధన్ నిజమైన తేదీ ఎప్పుడు, రక్షాబంధన్ శుభముహూర్తం వివరాలు తెలుసుకుందాం..
ధర్మసింధు ప్రకారం ప్రదోష వ్యాపిని పౌర్ణిమ నాడు రక్షాబంధన్ నిర్వహించుకోవాలి. భద్రా వ్యాపిని నాడు జరపకూడదు. వివరంగా చెప్పాలంచే...భద్రకాలంలో రెండు పండుగలు జరపకూడదు. భద్ర కాలంలో రాఖీ కడితే సోదరుని వినాశనానికి కారణమౌతుంది. భద్రకాలంలో హోలీ జరుపుకుంటే గ్రామస్థులకు హాని కలుగుతుంది.
ఆగస్టు 11, 2022 గురువారం ఉదయం 10.38 నిమిషాల నుంచి పౌర్ణిమ ప్రారంభమౌతుంది.ఆగస్టు 11వ తేదీ గురవారం నాడు భద్రకాలం 10.38 నిమిషాలకే ప్రారంభమై..రాత్రి 8.51 నిమిషాల వరకూ ఉంటుంది. ఆగస్టు 12, 2022 నాడు భద్రకాలం లేదు. కానీ పౌర్ణిమ తిధి ఉదయం 7.16 నిమిషాలవరకే ఉంది. ఉదయ తిధి కావడంతో ఆగస్టు 12వ తేదీనే రాఖీ జరుపుకోవాలి. ఆగస్టు 12వ తేదీ శుక్రవారం నాడు రక్షాబంధన్ లేదా రాఖీకు శుభ ముహూర్తం ఉదయం 6.12 నిమిషాల నుంచి 8.30 నిమిషాల వరకూ ఉంది.
ఇదే రోజు 10.30 నిమిషాల నుంచి 12 గంటల వరకూ రాహుకాలముంది. ఈ సమయంలో రాఖీ కట్టకూడదు. మద్యాహ్నం 1.06 నిమిషాల నుంచి 3.24 నిమిషాల వరకూ వృశ్చిక లగ్నం చాలా మంచిదిగా చెబుతున్నారు పండితులు.
Also read: Shani Dev Blessings: సూర్యాస్తమయం తర్వాత ఈ సాధారణ పరిహారం చేయండి.. ధనవంతులు కండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook