Venus Transit in Cancer: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతీ గ్రహం ఒక నిర్దిష్ట కాలం పాటు ఒక రాశిలో సంచరిస్తుంది. ఆ తర్వాత మరో రాశిలోకి ప్రవేశిస్తుంది. ఇది సవ్య దిశలో ఉండొచ్చు లేదా తిరోగమనం కూడా కావొచ్చు. రెండింటిలో ఏది జరిగినా.. గ్రహం రాశి మారడమనేది రాశిచక్రంలోని 12 రాశులను ప్రభావం చేస్తుంది. ఇవాళ శుక్ర గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించనుంది. ఇదే రాశిలో ఇప్పటికే సూర్యుడు సంచరిస్తున్నాడు. తద్వారా కర్కాటకంలో శుక్ర, సూర్య కలయిక జరగనుంది. సాధారణంగా శుక్రుడు సంపదకు, శుభాలకు అధిపతి. కర్కాటకంలో శుక్ర సూర్య సంయోగం కొన్ని రాశుల వారికి విశేషంగా కలిసిరానుంది. ఆ రాశులేంటో.. వారికి కలిగే శుభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కన్య (Virgo) : కన్య రాశి వారి జాతకంలో 11వ ఇంట్లో సూర్య శుక్ర సంయోగం జరగనుంది. ఇది ఆదాయానికి, లాభానికి సంకేతం. ఈ సంయోగ కాలం ఆర్థికపరమైన పురోగతి ఉంటుంది.ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న మార్గాలతో పాటు కొత్త మార్గాల ద్వారా డబ్బు చేకూరుతుంది. వ్యాపారస్తులు పెద్ద ఒప్పందాలకు అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. దీనివల్ల భవిష్యత్తులోనూ భారీ లాభాలు పొందుతారు.
తుల (Libra) : సూర్య శుక్ర సంయోగం తుల రాశి వారికి శుభసూచకం. ఇక నుంచి వీరికి మంచి రోజులు ప్రారంభమైనట్లే. తుల రాశి వారి జాతకంలో 10వ స్థానంలో సూర్య, శుక్ర సంయోగం ఏర్పడనుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. వ్యాపారమైనా, ఉద్యోగమైనా ఇక మీకు తిరుగుండదు. మీ ప్రమేయం ఉన్న ప్రతీ పని విజయవంతమవుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి దక్కే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి.
మిథునం (Gemini) : సూర్య శుక్ర కలయిక మిథున రాశి వారి జీవితంలోఅనేక మార్పులు తీసుకొస్తుంది. ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తుంది. మీ ఇంటికి ధన ప్రవాహం పెరుగుతుంది. మిథున రాశి వారి జాతకంలో 2వ స్థానంలో సూర్య శుక్ర కలయిక జరగనుంది. వ్యాపారస్తులు పెద్ద ఆర్డర్స్ పొందుతారు. నిన్న మొన్నటిదాకా నిస్సారంగా సాగిన జీవితం ఇప్పుడు ఫలవంతమవుతుంది.
సూర్య, శుక్ర గ్రహాల కలయిక ఒకరకంగా కన్య, తుల, మిథున రాశుల వారికి అదృష్ట కాలమని చెప్పాలి. ఈ కాలంలో అదృష్ట దేవత వీరి తలుపు తడుతుంది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోగలిగితే జీవితంలో తిరుగులేని స్థితికి చేరుకుంటారు.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, మతపరమైన విశ్వాసాలు ఆధారపడి ఉండవచ్చు. జీ తెలుగు న్యూస్ దానిని నిర్ధారించలేదు.)
Also Read: India vs West Indies: నాలుగో టీ20లో విండీస్‌పై భారత్ విజయం.. సిరీస్ సొంతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook