Sun Transit 2022: సూర్యభగవానుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తుంటాడు. ఈ సారి 11నెలల తర్వాత అంటే ఆగస్టు 17న తన సొంత రాశి అయిన సింహరాశిలోకి (Sun Transit in leo 2022) ప్రవేశించనున్నాడు. ఇప్పటికే ఆ రాశిలో బుధుడు ఉన్నాడు. దీంతో ఈ రెండు రాశులు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరచనున్నాయి. గ్రహాల మార్పు మెుత్తం 12 రాశులపై శుభ లేదా అశుభ ప్రభావాన్ని చూపిస్తాయి. సూర్యుడి రాశి మార్పు సింహ రాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుకుందాం.
సింహరాశిపై సూర్య సంచార ప్రభావం
సింహ రాశి వారికి సూర్యుడు తమ ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వీరు బాస్ తో గొడవపడకుండా వారి చెప్పింది చేస్తారు. పూర్వీకుల వ్యాపారంలో నిమగ్నమైన వ్యాపారవేత్తలకు ఈ సమయం కలిసి వస్తుంది. మీ భర్త లేదా భార్య ఏ పని చేయాలనుకుంటే వారికి మీ పుల్ సపోర్టు ఇవ్వండి. పిటినెస్ పై దృష్టి పెట్టండి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ అజాగ్రత్తగా ఉండకండి. ఈ సమయంలో బీపీ పేషెంట్లు జాగ్రతగా ఉండాలి. ఈ రాశివారు తండ్రి పట్ల అంకితభావంతో మెలగాలి.
Also Read: Shravana Purnima 2022: శ్రావణ పూర్ణిమ రోజు ఇలా చేస్తే.. లక్ష్మీదేవి మీ వెంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook