Bimbisara Movie 10 Days Collections: గత వారంలో విడుదలైన కళ్యాణ్ రామ్ బింబిసార, దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాలు ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి మరిన్ని కలెక్షన్లు సాధించే దిశగా పోతున్నాయి. ఈ రోజు ఈ సినిమాలు పది రోజులలో ఎన్ని వసూళ్లు సాధించాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కళ్యాణ్ రామ్ బింబిసార విషయానికి వస్తే చాలాకాలం తర్వాత కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో హిట్ కొట్టారు. వశిష్ట అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో కేవలం మూడే రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి వంటివారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా 10 రోజుల కలెక్షన్స్ విషయానికి వస్తే మొదటి రోజు 6 కోట్ల 30 లక్షలు, రెండో రోజు నాలుగో కోట్ల 52 లక్షలు, మూడవరోజు ఐదు కోట్ల రెండు లక్షలు, నాలుగో రోజు రెండు కోట్ల 27 లక్షలు, ఐదో రోజు రెండు కోట్ల 52 లక్షలు, ఆరవ రోజు కోటి రూపాయల 7 లక్షలు, ఏడవ రోజు 63 లక్షలు, ఎనిమిదో రోజు కోటి 13 లక్షలు, 9వ రోజు కోటి 14 లక్షలు సాధిస్తే పదో రోజు మాత్రం కోటి 45 లక్షలు సాధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులకు గాను 26 కోట్ల నాలుగు లక్షల షేర్ వసూలు సాధించింది.
అలాగే కర్ణాటక సహా మిగతా భారత దేశంలో కోటి రూపాయల 70 లక్షల సాధించిన ఈ చిత్రం ఓవర్సీస్ లో రెండు కోట్ల రెండు లక్షల రూపాయల వసూళ్లు సాధించి ప్రపంచవ్యాప్తంగా పది రోజులకు గాను 29 కోట్ల 76 లక్షలు వసూలు చేసింది. ఇక సినిమాకు 15 కోట్ల 60 లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో 16 కోట్ల 20 లక్షల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్ణయించారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసిన ఈ సినిమా 13 కోట్ల 56 లక్షల వసూళ్లు సాధించి మరిన్ని వసూళ్లు సాధించే దిశగా దూసుకు వెళ్తోంది.
Sita Ramam Movie 10 Days Collection: ఇక సీతారామం సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు కోటిన్నర, రెండో రోజు రెండు కోట్ల ఎనిమిది లక్షలు, మూడో రోజు రెండు కోట్ల 62 లక్షలు, నాలుగో రోజు కోటి 46 లక్షలు, ఐదో రోజు కోటి 71 లక్షలు, ఆరవ రోజు 91 లక్షలు, ఏడవ రోజు 65 లక్షలు, 8వ రోజు 73 లక్షలు, 9వ రోజు 84 లక్షల, వసూళ్లు సాధించి 10వ తేదీ మాత్రం మళ్లీ కోటి రూపాయల 13 లక్షల వసూళ్లు చేసింది.
ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో పది రోజులకు గాను 13 కోట్ల 64 లక్షల రూపాయలు వసూలు సాధించగా కర్ణాటక సహా మిగతా ప్రాంతాల్లో కోటిన్నర, ఇతర భాషలలో నాలుగు కోట్ల 20 లక్షలు, ఓవర్సీస్ లో ఐదు కోట్ల 10 లక్షలు వసూలు సాధించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 24 కోట్ల 39 లక్షల వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా 16 కోట్ల 20 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకోవడంతో 15 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్ణయించారు. ఇప్పటికే ఆ మార్కు దాటేసిన సినిమా ఏడు కోట్ల 39 లక్షల లాభాలు సాధించి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది.
Also Read: Pavitra Lokesh: నరేష్-పవిత్రలది ప్రేమ బంధం కాదట.. కరెన్సీ బంధమట.. ఎందుకో తెలుసా?
Also Read: Karthikeya 2: రెండో రోజు మరింత పెరిగిన కార్తికేయ 2 వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ కు ఇంకెంత దూరమంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి