PMVVY Scheme: సీనియర్ సిటిజెన్ పెన్షన్ స్కీమ్, నెలకు 9 వేల పెన్షన్, ఎలా అప్లై చేయాలంటే

PMVVY Scheme: కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ రకాల సంక్షేమ పథకాల గురించి చాలామందికి తెలియదు. అందులో ఒకటి ప్రధానమంత్రి వయో వందన యోజన పథకం. ఆ పధకం గడువు మరి కొద్దినెలల్లో ముగియనుంది. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 20, 2022, 08:22 PM IST
PMVVY Scheme: సీనియర్ సిటిజెన్ పెన్షన్ స్కీమ్, నెలకు 9 వేల పెన్షన్, ఎలా అప్లై చేయాలంటే

PMVVY Scheme: కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ రకాల సంక్షేమ పథకాల గురించి చాలామందికి తెలియదు. అందులో ఒకటి ప్రధానమంత్రి వయో వందన యోజన పథకం. ఆ పధకం గడువు మరి కొద్దినెలల్లో ముగియనుంది. ఆ వివరాలు మీ కోసం..

60 ఏళ్ల దాటిన వయో వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పధకం ప్రధానమంత్రి వయో వందన యోజన పథకం. ఈ పథకం కోసం అప్లై చేయాలంటే ఆఖరు తేదీ 2023 మార్చ్ 31. ఎల్ఐసీ ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. స్థూలంగా పీఎంవీవీవైగా పిలిచే ఈ పధకం కింద..కనీస, గరిష్ట మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లించి ప్లాన్ తీసుకుంటే తక్షణమే అమల్లో వస్తుంది.పెన్షన్ నెలకు లేదా మూడు నెలలకు లేదా ఆరు నెలలకు, లేదా ఏడాదికోసారి తీసుకోవచ్చు. అయితే పథకం కోసం పెట్టుబడి పెట్టాలంటే ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బులుండాలి.

నెలకు 9 వేలవరకూ పెన్షన్ 

నెలకు పెన్షన్ ఎంతనేది సీనియర్ సిటిజెన్ పెట్టే పెట్టుబడిని బట్టి ఉంటుంది.  ప్రారంభ పెట్టుబడిగా 1,62,162 రూపాయలు పెడితే..కనీస పెన్షన్ నెలకు వేయి రూపాయలు వస్తుంది. అదే 15 లక్షలు పెట్టుబడి పెడితే నెలవారీ పెన్షన్ 9,250 రూపాయలు అందుతాయి. ఏడాది పెన్షన్ ఒకేసారి 1,11000 తీసుకోవాలంటే మాత్రం డిస్కౌంట్ ఉంటుంది. 14,49,86 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. గరిష్ట పెట్టుబడి 15 లక్షలే. భార్యాభర్తలిద్దరూ సీనియర్ సిటిజన్లు అయితే ఒక్కొక్కరు 15 లక్షలు పెట్టవచ్చు.

పీఎంవీవీవై ప్రత్యేకతలు

పీఎంవీవీవై అనేది పెన్షన్, మరణ, మెచ్యూరిటీ ప్రయోజనాల్ని అందిస్తుంది. ఖాతాదారుడు ఎంచుకున్న పెన్షన్ విధానంపై ఆధారపడి పదేళ్ల కాలానికి ఉంటుంది. పదేళ్లలో పెన్షన్‌దారుడు మరణిస్తే..పాలసీ కొన్నధరను లబ్దిదారుడికి ఇచ్చేస్తారు. పదేళ్ల పాటు జీవించి ఉంటే..చివరి వాయిదాతో పాటు కొనుగోలు ధర ఇచ్చేస్తారు. వయస్సు 60 ఏళ్లు దాటుండాలి. గరిష్ట వయో పరిమితి లేదు. మధ్యలో ఎప్పుడైనా పాలసీని సరెండర్ చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే కొనుగోలు ధరలో 98 శాతం ఉపసంహరించుకోవచ్చు.

అప్లై చేసేందుకు గడువు తేదీ 2023 మార్చ్ 31తో ముగుస్తోంది. ఆధార్ కార్డు, పాన్‌కార్డు, వయసు ధృవీకరణ, చిరునామా, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అవసరమౌతాయి. ఏదైనా ఎల్ఐసీ బ్రాంచ్‌లో అప్లై చేయవచ్చు. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి కూడా దరఖాస్తు చేయవచ్చు. ఈ పథకం కింద పన్ను మినహాయింపు మాత్రం లేదు. రిటర్న్స్‌కు వర్తించే పన్నురేటు ఉంటుంది. జీఎస్టీ మాత్రం మినహాయింపు ఉంటుంది. 

Also read: BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ సూపర్ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌.. 75 రోజులకు రూ. 275 మాత్రమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News