CJI Tenure: సుప్రీం కోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో సీజేఐగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఐతే ఆయన కొన్ని రోజులు మాత్రమే పదవిలో కొనసాగుతారు. ఈఏడాది నవంబర్ 8న ఉదయ్ ఉమేష్ లలిత్ పదవి విరమణ చేస్తారు. మొత్తంగా ఆయన 74 రోజులు మాత్రమే సీజేఐగా సేవలు అందించనున్నారు.
నిబంధనల ప్రకారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు 65 ఏళ్లు వచ్చే వరకు మాత్రమే ఆ పదవిలో ఉంటారు. హైకోర్టు న్యాయమూర్తులైతే 62 ఏళ్లకు పదవి విరమణ పొందుతారు. ఇప్పటివరకు భారత దేశ చరిత్రలో కేవలం 18 రోజులు మాత్రమే సీజేఐగా పనిచేసిన వారు ఉన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కమల్ నరైన సింగ్ కేవలం 18 రోజులు మాత్రమే పనిచేశారు. 1991 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 12 వరకు మాత్రమే ఆయన సీజేఐగా బాధ్యతలు చేపట్టారు.
2004 మే 2న సీజేఐగా జస్టిస్ ఎస్ రాజేంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ఐతే అదే ఏడాది మే 31న రిటైర్మెంట్ పొందారు. కేవలం 30 రోజులు మాత్రమే సీజేఐగా పని చేశారు. 1970 డిసెంబర్ 17న సీజేఐగా జస్టిస్ జేసీ షా ప్రమాణం చేశారు. 1971 జనవరి 21 వరకు కొనసాగారు. అంటే కేవలం 36 రోజులు మాత్రమే సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించారు. 41 రోజులపాటు సీజేఐగా జస్టిస్ జీబీ పట్నాయక్ పని చేశారు. 2002 నవంబర్ 8 నుంచి డిసెంబర్ 18 వరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.
ఈసందర్భంగా పలు తీర్పులను వెలువరించారు. 1992 నవంబర్ 18న సుప్రీం కోర్టు సీజేగా జస్టిస్ ఎల్ఎం శర్మ బాధ్యతలు స్వీకరించారు. 1992 నవంబర్ 18 నుంచి 1993 ఫిబ్రవరి 11 వరకు అంటే 86 రోజులపాటు సీజేఐగా పనిచేశారు. నిన్న సీజేఐగా ఎన్వీ రమణ పదవి విరమణ చేశారు. ఆయన ఆధ్వర్యంలో కీలక తీర్పులు వెలువడ్డాయి. సీజేఐగా..తెలుగువాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Delhi | Justice Uday Umesh Lalit takes oath as The Chief Justice of India at Rashtrapati Bhavan in the presence of President Droupadi Murmu pic.twitter.com/dxPMsS4IYE
— ANI (@ANI) August 27, 2022
#WATCH | President Droupadi Murmu administers the oath of Office of the Chief Justice of India to Justice Uday Umesh Lalit at Rashtrapati Bhavan pic.twitter.com/HqayMJDwBB
— ANI (@ANI) August 27, 2022
Also read:Pitru Paksha 2022: పితృ పక్షంలో వచ్చే ఆ కలలు దేనికి సంకేతం..
Also read:JP NADDA MEETING LIVE UPDATES: బీజేపీలోకి క్రికెటర్ మిథాలీ రాజ్! జేపీ నడ్డాతో కీలక సమావేశం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి