Asia Cup 2022: ఆసియా కప్‌లో అఫ్ఘనిస్థాన్ సూపర్ షో..ప్రపంచ రికార్డు సాధించిన నజీబుల్లా..!

Asia Cup 2022: ఆసియా కప్‌లో అఫ్ఘనిస్థాన్‌ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సూపర్-4కు దూసుకెళ్లింది. ఈక్రమంలో ఆ జట్టు ప్లేయర్ సరికొత్త రికార్డు సాధించాడు.

Written by - Alla Swamy | Last Updated : Aug 31, 2022, 03:06 PM IST
  • ఆసియా కప్‌ 2022
  • సూపర్-4కు అఫ్ఘనిస్థాన్‌
  • ఈక్రమంలో అరుదైన రికార్డు
Asia Cup 2022: ఆసియా కప్‌లో అఫ్ఘనిస్థాన్ సూపర్ షో..ప్రపంచ రికార్డు సాధించిన నజీబుల్లా..!

Asia Cup 2022: ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్ఘనిస్థాన్‌ సంచలన విజయం సాధించింది. చివరి ఆరు ఓవర్లలో 60కిపైగా పరుగులు సాధించి ఔరా అనిపించింది. ఆ జట్టు ప్లేయర్ నజీబుల్లా జద్రాన్ రెచ్చిపోయాడు. 17 బంతుల్లో 6 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 43 పరుగులు చేశాడు. దీంతో అఫ్ఘనిస్థాన్‌కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. దీంతో ఆ జట్టు గ్రూప్‌-బీలో టాపర్‌గా సూపర్-4లోకి దూసుకెళ్లింది. 

ఈనేపథ్యంలో నజీబుల్లా జద్రాన్ ఖాతాలోకి ప్రపంచ రికార్డు చేరింది. టీ20ల్లో చేజింగ్‌లో డెత్ ఓవర్లలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నజీబుల్లా జద్రాన్ నిలిచాడు. లక్ష్య చేధనలో ఇప్పటివరకు అతడు 18 సిక్సర్లు బాదాడు. దీంతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 17 సిక్సర్లు, శ్రీలంక ఆల్‌రౌండర్ తిసార పెరీరా 17 సిక్సర్ల రికార్డును నజీబుల్లా చెరిపివేశాడు. దీంతో అతడు ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

టీ20 క్రికెట్‌లో ఫస్ట్, సెకండ్ ఇన్నింగ్స్‌ అన్న తేడా లేకుండా డెత్ ఓవర్లలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నజీబుల్లా జద్రాన్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు అతడు 53 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్ 47 సిక్సర్లతో రెండో స్థానంలో నిలిచాడు. బంగ్లాండ్-అఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌ తర్వాత నజీబుల్లా జర్దన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వికెట్ చాలా లోగా ఉందని గ్రహించి స్లోగా ఇన్సింగ్స్ ప్రారంభించి..ఆ తర్వాత తన బ్యాట్‌కు పని చెప్పానని తెలిపాడు.

తాను సరిహద్దులు చూడనని..కేవలం బౌలర్‌ను మాత్రమే గమనిస్తానని స్పష్టం చేశారు. ఈవిజయంతో సూపర్-4కు చేరుకున్నామని..ఫైనల్‌కు వెళ్లడమే తమ లక్ష్యమన్నాడు నజీబుల్లా జర్దన్. తన సంచలన ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును దక్కించుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్  చేసిన బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అఫ్ఘనిస్థాన్ జట్టులో రహ్మాన్, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లు తీశారు. 

బంగ్లాదేశ్ ప్లేయర్ ముసాదిక్ 31 బంతుల్లో  48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. లక్ష్య చేధనకు దిగిన అఫ్ఘనిస్థాన్ 13 ఓవర్లలో మూడు వికెట్లకు 62 పరుగులు చేసింది. మ్యాచ్‌ గెలవడం అసాధ్యమనకున్న సమయంలో నజీబుల్లా, ఇబ్రహీమ్‌ రెచ్చిపోయి ఆడాడు. ఇద్దరు నాటౌట్‌గా నిలిచి స్కోర్‌ను కొట్టిపాడేశారు. 

Also read:Cobra Movie Review: విక్రమ్ నటించిన కోబ్రా మూవీ ఎలా ఉందంటే?

Also read:MLC Kavitha: విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి..కవిత ఇంట్లో వినాయక చవితి ఉత్సవాలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News