UP Police Fighting Video: పోలీసులు కొట్టుకుని, తన్నుకుంటున్న సమయంలోనే అటుగా వెళ్లే వాళ్లెవరో ఈ వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది.. ఈ పోలీసులు ఎవరు అనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం. ఉత్తర్ ప్రదేశ్లోని జలాన్ జిల్లా రాంపుర పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత వారం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిలో కానిస్టేబుల్ ధరమ్ వీర్ కి, హోమ్ గార్డు సునీల్ కుమార్ కి మధ్య ఏదో విషయంలో వివాదం తలెత్తింది. ఆ వివాదం కాస్తా... చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో నడిరోడ్డుపైనే పెట్రోలింగ్ వాహనం నిలిపిన సిబ్బంది అందులోంచి దిగి బయటికొచ్చి ముష్టి యుద్ధం చేయడం ప్రారంభించారు. తూ కిత్తారే.. అంటే తూ కిత్తారే అని బూతులు తిట్టుకుంటూ తన్నుకోవడం మొదలుపెట్టారు. మద్యం మత్తులో తాము పోలీసుల అని.. అది కూడా యూనిఫామ్ ధరించి ఉన్నామనే విషయం కూడా మర్చిపోయారు. నలుగురు చూస్తే నవ్వుల పాలవుతాం అనే ఇంగిత జ్ఞానం లేకుండా కొట్టుకున్నారు. బూతులు తిట్టుకున్నారు.
UP Police Fighting Video: పోలీసులే కానీ పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు.. పోలీసుల ఫైటింగ్ వీడియో వైరల్