Facebook Services: అక్టోబర్ 1 నుంచి ఫేస్‌బుక్‌లో ఆ ఫీచర్ బంద్, ప్రత్యామ్నాయమేంటి

Facebook Services: ఫేస్‌బుక్ యూజర్లకు బ్యాడ్‌న్యూస్. మెటా సంస్థ త్వరలో ఫేస్‌బుక్ కీలక సేవల్ని నిలిపివేయనుంది. ఎందుకు, ఏంటనే వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 6, 2022, 07:55 PM IST
Facebook Services: అక్టోబర్ 1 నుంచి ఫేస్‌బుక్‌లో ఆ ఫీచర్ బంద్, ప్రత్యామ్నాయమేంటి

Facebook Services: ఫేస్‌బుక్ యూజర్లకు బ్యాడ్‌న్యూస్. మెటా సంస్థ త్వరలో ఫేస్‌బుక్ కీలక సేవల్ని నిలిపివేయనుంది. ఎందుకు, ఏంటనే వివరాలు తెలుసుకుందాం.

మెటా సంస్థ నడుపుతున్న ఫేస్‌బుక్‌కు సంబంధించి ఇది కీలకమైన అప్‌డేట్. త్వరలో అంటే అక్టోబర్ 1 నుంచి ఫేస్‌బుక్‌లో ఆ సేవలు నిలిచిపోనున్నాయి. అక్టోబర్ 1 నుంచి నైబర్‌హుడ్ పేరున్న హైపర్ ప్రొఫైల్ ఫీచర్‌ను మెటా సంస్థ నిలిపివేస్తోంది. ఈ ఫీచర్ యూజర్లను వారి పొరుగువారితో కలపడం, వారి విభాగంలో కొత్త అవకాశాల్ని అణ్వేషించడం, స్థానిక గ్రూపుల్లో భాగంగా చేయడంలో సహాయపడుతోంది. ఈ సేవల్ని తొలిసారిగా 2022లో అమెరికా, కెనడాలో వంటి దేశాల్లో ప్రారంభించారు. ఈ సేవల్ని ఉపయోగించుకునేందుకు ఓ ప్రత్యేక ప్రొఫైల్ ఏర్పాటు చేసే ఆప్షన్ ఉండేది.

మెటా సంస్థకు ఈ ఫీచర్ ద్వారా ప్రత్యేక ప్రయోజనాలు సిద్ధించలేదు. అందుకే ఈ ఫీచర్‌ను క్లోజ్ చేయాలని నిర్ణయించింది. అయితే ఎందుకు ఈ సేవల్ని నిలిపివేస్తుందనేది మెటా స్పష్టం చేయలేదు. ప్రస్తుతం కంపెనీలో కాస్ట్ కటింగ్ జరుగుతోంది. అందులో భాగంగా ఈ సేవల్ని నిలిపివేస్తున్నట్టుగా తెలుస్తోంది. 

ఫేస్‌బుక్ నైబర్‌హుడ్‌ను లాంచ్ చేసినప్పుడు..స్థానిక సముదాయాన్ని ఒకటి చేయాలనేది ఆలోచనగా ఉండేదని..ఫేస్‌బుక్ తెలిపింది. అందర్నీ కలిపేందుకు ఇదొక మంచి విధానమౌతుందని..ఇతరులు కూడా మరొకరి ప్రొఫైల్ చూసే పరిస్థితి ఉంటుందని భావించామని మెటా వెల్లడించింది. ఇతర సోషల్ మీడియా వేదికల్లానే ఫేస్‌బుక్ కూడా దిశానిర్దేశాలు జారీ చేసింది. 

ఫేస్‌బుక్‌కు ఈ ఫీచర్ ద్వారా ఆశించిన ప్రయోజనాలు లభించకపోవడంతో..దీనిపై పెట్టే ఖర్చును తగ్గించేందుకు ఈ ఫీచర్ మూసివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

Also read: Dreamfolks Share Price: లిస్టింగ్ రోజే 56 శాతం పెరుగుదలతో షేర్ మార్కెట్‌ను కుదిపిన కంపెనీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News