Tagore Scene: చిరంజీవి 'ఠాగూర్' సీన్ రిపీట్.. మృతి చెందిన పేషెంట్‌కు వైద్యం.. ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం..

Tagore Movie Scene Repeats in a Private Hospital: చిరంజీవి ఠాగూర్ సినిమాలో మృతదేహానికి ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లుగా వైద్యులు డ్రామా రక్తి కట్టించే సీన్ ఒకటి ఉంటుంది. అచ్చు అలాంటి సీన్ తాజాగా ఆమనగల్లులో చోటుచేసుకుంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 8, 2022, 07:44 AM IST
  • రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం
  • మృతదేహానికి వైద్యం అందిస్తున్నట్లుగా డ్రామా
  • కుటుంబ సభ్యుల ఆందోళనతో రూ.8 లక్షలకు ఒప్పందం
Tagore Scene: చిరంజీవి 'ఠాగూర్' సీన్ రిపీట్.. మృతి చెందిన పేషెంట్‌కు వైద్యం.. ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం..

Tagore Movie Scene Repeats in a Private Hospital: రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు పట్టణ కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చిరంజీవి ఠాగూర్ సినిమా తరహా సీన్ చోటు చేసుకుంది. మృతి చెందిన పేషెంట్‌కు వైద్యం అందిస్తున్నట్లుగా వైద్య సిబ్బంది డ్రామాకు తెరలేపారు. కాసేపటికే పేషెంట్ మృతి చెందినట్లు చెప్పారు. వైద్య సిబ్బంది తీరుపై అనుమానం కలిగిన పేషెంట్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో రూ.8 లక్షలు ఇస్తామని బేరసారాలకు దిగారు. గత ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళకు ఆదివారం (సెప్టెంబర్ 1) పురిటి నొప్పులు రావడంతో ఆమనగల్లులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మహిళకు సిజేరియన్ ద్వారా డెలివరీ చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కాసేపటికే ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించింది. బిడ్డ జన్మించిన కొద్దిసేపటికే ఆమె మృతి చెందింది.

వైద్యులు మాత్రం ఆమె మృతి చెందిన విషయాన్ని సీక్రెట్‌గా ఉంచారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్నామని చెప్పారు. చెప్పినట్లుగానే ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆమెకు మెరుగైన వైద్యం అందుతోందని..  త్వరగానే కోలుకుంటుందని చెప్పారు. కొద్దిసేపటికే ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులతో చెప్పారు. తాము ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమెను బతికించలేకపోయామని తెలిపారు. వైద్యుల తీరుపై అనుమానం కలగడంతో మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో రూ.8 లక్షలు ఇస్తామని వారితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులకు  ఫిర్యాదు అందలేదని సమాచారం.

Also Read: Hyderabad Ganesh Immersion 2022: వినాయక నిమజ్జనంపై వివాదం.. సద్ది కట్టుకుని హిందువులు ట్యాంక్ బండ్ రావాలని సంజయ్ పిలుపు

Also Read: Horoscope Today September 8th 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారు ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండాలి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x