Revanth Reddy: హైదరాబాద్ లో అల్లర్లు లేపి.. పరిశ్రమలను గుజరాత్ కు తరలించే కుట్ర!

Revanth Reddy:  సెప్టెంబర్ 17పై రాజకీయ పార్టీల మధ్య రచ్చ కొనసాగింది. అన్ని పార్టీలు ఎవరి దారిలో అని వేడుకలను నిర్వహించాయి. బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం జరపగా... టీఆర్ఎస్ సర్కార్ సమైక్యతా వజ్రోత్సవాలు జరిపింది.

Written by - Srisailam | Last Updated : Sep 17, 2022, 01:07 PM IST
  • పటేల్ కాంగ్రెస్ అధ్యక్షుడు- రేవంత్ రెడ్డి
  • తెలంగాణ అల్లర్లకు బీజేపీ కుట్ర- రేవంత్
  • గుజరాత్ వ్యాపారుల కుట్ర ఉంది- రేవంత్
Revanth Reddy: హైదరాబాద్ లో అల్లర్లు లేపి.. పరిశ్రమలను గుజరాత్ కు తరలించే కుట్ర!

Revanth Reddy:  సెప్టెంబర్ 17పై రాజకీయ పార్టీల మధ్య రచ్చ కొనసాగింది. అన్ని పార్టీలు ఎవరి దారిలో అని వేడుకలను నిర్వహించాయి. బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం జరపగా... టీఆర్ఎస్ సర్కార్ సమైక్యతా వజ్రోత్సవాలు జరిపింది. కాంగ్రెస్ పార్టీ విలీన దినోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో పరస్పర ఆరోపణలు చేసుకున్నారు నేతలు. గాంధీభవన్ లో NSUI ఆధ్వర్యంలో నిర్వహించిన   "ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదాభివందనము" పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.పోస్టర్ ను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు.

తెలంగాణ వేడుకల కోసం బీజేపీ వాడుకుంటున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారని చెప్పారు రేవంత్ రెడ్డి.  ఆయన RSS ను నిషేధించారని తెలిపారు, స్వతంత్ర పోరాటంలో,  తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర లేదన్నారు రేవంత్ రెడ్డి. చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని.. ఇతర పార్టీల అధ్యక్షులను దొంగిలించి చరిత్రలో స్థానం కల్పించుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని  వక్రీకరించి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని అన్నారు.ఇందుకు సెప్టెంబర్ 17ను ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ తో పాటు గుజరాత్ లోని జూనిఘాడ్ కూడా తర్వాతనే ఇండియన్ యూనియన్ లో విలీనం అయిందన్నారు. మరీ గుజరాత్ లో బిజేపీ వజ్రోత్సవాలు ఎందుకు నిర్వహించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే హైదరాబాద్ లో బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మొదట గుజరాత్ లో ఉత్సవాలు జరిపి తర్వాత హైదరాబాద్ రావాలని ఆయన కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు.గుజరాతీ మంత్రులు, పెట్టుబడిదారులు తెలంగాణపై కుట్ర కోణంలోనే ఈ కార్యక్రమం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో అల్లర్లు లేపి.. ఇక్కడి పరిశ్రమలను గుజరాత్ కు తరలించుకు పోవాలని చూస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. ప్రశాంత వాతావరణం ఉన్న హైదరాబాద్ లో మత కల్లోలం సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు.  రెచ్చగొట్టడం కాదు..తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ ప్రణాళిక ఏమిటో చెప్పాలని పీసీసీ చీఫ్ నిలదీశారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ను భూతంగా చూపి బీజేపీ తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తోందని అన్నారు. .తెలంగాణ సమాజం ఈ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపిచ్చారు.రాజకీయ నాయకులంటేనే చీడపురుగుల్లా చూసే పరిస్థితిని టీఆరెస్, బీజేపీ కల్పించాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. సిద్ధాంతాలకు ప్రతినిధులమని చెప్పుకునే అమిత్ షా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

Read Also: AP Capital: రాజధాని నిర్ణయించే హక్కు రాష్ట్రానిదే! సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ పిటిషన్..  

Read Also: Amit shah: హైదరాబాద్ లో కలకలం.. అమిత్ షాను అడ్డుకునే ప్రయత్నం.. కారు అద్దాలు పగలగొట్టిన ఎస్పీజీ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News