Jivitputrika Vrat 2022 Puja: పిల్లల ఉజ్వల భవిష్యత్తు మరియు దీర్ఘాయువు కోసం జీవితపుత్రిక వ్రతాన్ని ప్రతి సంవత్సరం అశ్వినీ మాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ వ్రతాన్నే జితియా లేదా జియుతియా అని కూడా అంటారు. ఈ పూజలో జీమూతవాహనుడిని పూజిస్తారు. అయితే ఈ ఉపవాసం చాలా కష్టమైనది. ఈ రోజున మహిళలు నీటిని కూడా తాగకుండా నిర్జల ఉపవాసం ఉంటారు. ఈసారి జీవితపుత్రిక వ్రతాన్ని (Jivitputrika Vrat 2022) ఇవాళ అంటే 18 సెప్టెంబర్ 2022న ఆచరించనున్నారు. ఈ వ్రత ముహూర్తం, యోగం మరియు పూజా విధానం తెలుసుకోండి.
జీవితపుత్రిక వ్రత శుభ ముహూర్తం
బ్రహ్మ ముహూర్తం - ఉదయం 04:40 - ఉదయం 05:26
అభిజిత్ ముహూర్తం - ఉదయం 11:56 - మధ్యాహ్నాం 12:45
విజయ్ ముహూర్తం - మధ్యాహ్నాం 02:23 - మధ్యాహ్నాం 03:12
సంధ్య ముహూర్తం - సాయంత్రం 06:16 - సాయంత్రం 06:40
వ్రత పారణ సమయం - ఉదయం 6.10 తర్వాత (సెప్టెంబర్ 19, 2022)
అశ్వినీ మాసం కృష్ణ అష్టమి తేదీ ప్రారంభం- 17 సెప్టెంబర్ 2022, మధ్యాహ్నాం 02:14
అశ్వినీ మాసం కృష్ణ అష్టమి తేదీ ముగింపు - 18 సెప్టెంబర్ 2022, సాయంత్రం 04:32
జీవితపుత్రిక వ్రత శుభయోగం
జీవితపుత్రిక వ్రతం సప్తమి నుండి అశ్వినీ మాసంలో కృష్ణ పక్ష నవమి వరకు ఉంటుంది. ఈ వ్రతాన్ని ప్రధానంగా బీహార్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, జార్ఖండ్‌లలో వైభవంగా జరుపుకుంటారు. ఈ సారి జీవితపుత్రిక వ్రతం రోజున సిద్ధి యోగం ఏర్పడుతోంది, ఇది ఈ ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను మరింత పెంచింది.
సిద్ధి యోగం - 17 సెప్టెంబర్ 2022, ఉదయం 05.51 - 18 సెప్టెంబర్ 2022, ఉదయం 06.34
పూజా విధానం
జీవితపుత్రిక వ్రతం ఆచరించే స్త్రీలు సూర్యోదయానికి ముందు స్నానమాచరించి శుభ్రమైన బట్టలు ధరించి ఉపవాస దీక్షను చేపట్టాలి. అనంతరం తర్వాత నిర్జల వ్రతాన్ని ఆచరించాలి. ఈరోజున ప్రదోష కాలంలో కుశ నుండి జిముత్వాహనుడి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్టించండి. ధూపం, దీపం, మిఠాయిలు, పండ్లు, వెదురు ఆకులు, ఆవనూనె, నూనె పిండి, అక్షత (బియ్యం), పేడ, దూర్వాల దండ, పాన్, లవంగాలు, ఏలకులు, తమలపాకులను జిముత్వాహన దేవుడికి సమర్పించండి. పూజా స్థలంలో గోమూత్రంతో శుద్ధి చేయండి. జీవితపుత్రిక వ్రత కథను చదివి చివరలో హారతి ఇవ్వండి. ఇక మూడో రోజు ఉపవాసం విరమించండి.
జీవితపుత్రిక వ్రత కథ
పురాణాల ప్రకారం, మహాభారత యుద్ధంలో తండ్రి ద్రోణాచార్యుడు మరణించిన తరువాత అతని కుమారుడు అశ్వత్థామ కోపంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ బ్రహ్మాస్త్రం వల్ల అభిమన్యుడి భార్య ఉత్తర కడుపులోని బిడ్డ చనిపోయాడు. దీని తరువాత, శ్రీ కృష్ణుడు తన దైవిక శక్తితో శిశువును పునరుద్ధరించాడు. ఈ బిడ్డకు జీవితపుత్రిక అని పేరు పెట్టారు, తర్వాతే అతడే పరీక్షిత్తు మహారాజుగా ప్రసిద్ధి చెందాడు. ఆ రోజు నుండి పిల్లల దీర్ఘాయువు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
Also Read: Budhaditya Raj Yog: కన్యారాశిలో బుధాదిత్య యోగం.. ప్రకాశించనున్న ఈ 4 రాశుల అదృష్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook