Prisoner, Call Girl: ఆస్పత్రి గదిలో వేశ్యతో పట్టుబడిన ఖైదీ.. ఆస్పత్రికి వెళ్లింది అందుకేనా ?

Prisoner Caught With Prostitute: మర్డర్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ చికిత్స పేరుతో ఆస్పత్రికి వెళ్లి వేశ్యతో గడుపుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతే ఆ సీన్ ఎలా ఉంటుంది ? ఇంతకీ వేశ్యతో సమయం గడిపేందుకు ఆ ఖైదీకి సహకరించేది ఎవరు ? ఇలా ఈ ఒక్క ఖైదీ విషయంలోనే జరిగిందా ? లేక ఇది రోటీన్ వ్యవహరమా ? ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది ? ఇదిగో ఫుల్ న్యూస్ రిపోర్ట్ 

Written by - Pavan | Last Updated : Oct 1, 2022, 02:32 AM IST
  • సినీ ఫక్కీలో ఆస్పత్రిలో చేరిన ఖైదీ
  • ఆస్పత్రిలో వేశ్యతో సరసాలు
  • పోలీసులకే షాకిచ్చిన మర్డర్ కేసు ఖైదీ
Prisoner, Call Girl: ఆస్పత్రి గదిలో వేశ్యతో పట్టుబడిన ఖైదీ.. ఆస్పత్రికి వెళ్లింది అందుకేనా ?

Prisoner Caught With Prostitute: మర్డర్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ అనారోగ్యంతో ఇటీవలే ఆస్పత్రిలో చేరాడు. గురువారం రాత్రి ఆస్పత్రిలో ఖైదీలు చికిత్స పొందుతున్న వార్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన ఒక ఖైదీ అక్కడ లేనట్టు గుర్తించిన పోలీసులు వెంటనే ఆస్పత్రి అంతా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఖైదీ కనిపించకుండా పోయాడన్న టెన్షన్‌లో ఉన్న పోలీసులకు ఈ సెర్చ్ ఆపరేషన్‌లో మరో షాకింగ్ న్యూస్ బయటపడింది. కనిపించకుండా పోయిన ఖైదీ మరెక్కడో లేడు.. అదే ఆస్పత్రిలో మరో గదిలో వేశ్యతో సరసాలాడుతూ పట్టుబడ్డాడు. వేశ్యతో ఖైదీ పట్టుబడటం చూసి షాకవడం పోలీసుల వంతయ్యింది. అది కూడా ఆస్పత్రి గదిలోనే ఈ ఉదంతం చోటుచేసుకోవడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. బీహార్‌లోని వైశాలి జిల్లా హాజిపూర్‌లో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

చికిత్స పేరుతో ఖైదీ ఆస్పత్రికి వచ్చింది అందుకేనా ?
ఆస్పత్రి సిబ్బంది ప్రమేయం లేనిదే ఆస్పత్రి గదిలో ఇది ఎలా సాధ్యం అని అనుమానించిన పోలీసులు.. ఖైదీ, వేశ్యతో పాటు నలుగురు సెక్యురిటీ గార్డులు, మరొక సిబ్బందిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రి ఆవరణలో ఇలాంటి కార్యకలాపాలు ఎన్నాళ్లుగా కొనసాగుతున్నాయి, ఏంటనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఆస్పత్రిలో వేశ్యతో ఖైదీ పట్టుబడిన ఘటనపై అదే ఆస్పత్రిలో సివిల్ సర్జన్‌గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ అమరేంద్ర నారాయణ సాహీ ఏఎన్ఐతో మాట్లాడుతూ... ఒక ఎన్జీవో కార్యకర్త గది తాళాలు ఇచ్చి సహకరించినట్టు తెలిసిందని అన్నారు. వాస్తవానికి సదరు ఖైదీ ఒక హార్ట్ పేషెంట్. అతడికి గుండెలో నొప్పి రావడంతో ఢిల్లీ ఎయిమ్స్‌కి సిఫార్సు చేశారు. అయితే, ఎందుకో కానీ అతడిని అక్కడికి తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చారని డా అమరేంద్ర నారాయణ్ సాహి తెలిపారు. 

నందిని నర్సింగ్ హోమ్ సీన్స్‌ని గుర్తుకు తెచ్చిన ఖైదీ ఉదంతం
బిహార్ లో జరిగిన ఈ రియల్ సీన్ చూస్తోంటే.. సరిగ్గా ఆరేళ్ల క్రితం వచ్చిన నందిని నర్సింగ్ హోమ్ అనే సినిమా గుర్తుకొస్తోంది కదా.! ఈ సినిమాలో కమెడియన్ పాత్ర పోషించిన సప్తగిరి ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆస్పత్రిలోనే సరదాగా బ్రోతల్ హౌజ్ రన్ చేస్తుంటాడు. హోటల్లో రైడింగ్స్‌కి వచ్చినట్టు పోలీసులు ఆస్పత్రిలో రైడ్స్ చేయరు కాబట్టి ఈ దందాకు ఇదే సేఫ్ ప్లేస్ అని సదరు కమెడియన్ కొట్టిన డైలాగ్.. ఈ సీన్‌కి సింక్ అవుతుంది కదా. ఏదేమైనా వేశ్యతో ఖైదీ సరసాలు సినీ ఫక్కీలోనే ఉన్నాయి. ఇలా ఎప్పటి నుంచి జరుగుతోంది, ఏంటనే మొత్తం కథా కమా మిషు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Also Read : Making Liquor from Medicines: మెడిసిన్స్ నుండి లిక్కర్ తయారీ చేస్తోన్న డాక్టర్

Also Read : Faulty Oximeter: పనిచేయని ఆక్సీమీటర్ శవానికి పెట్టి.. బతికే ఉన్నాడని 18 నెలలు శవాన్ని ఇంట్లో పెట్టుకుని..

Also Read : Man Shoots Girlfriend: గాళ్‌ఫ్రెండ్‌ని గన్‌తో కాల్చి పారిపోబోయాడు.. ఇంతలోనే..

Also Read : Kidneys Theft: ఆస్పత్రికి వెళ్లిన మహిళ రెండు కిడ్నీలు మాయం.. అవయవాల దొంగల ముఠా పనేనా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News