Diabetes Control In 7 Days: మధుమేహం భారత్‌లో ఒక సాధరమైన వ్యాధిగా మారిపోయింది. దేశ వ్యాప్తంగా ప్రతి ఇంటిలో ఇద్దరు లేదా ముగ్గురు మధుమేహం బారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధి శరీరంలో తీవ్ర రూపం దాల్చకముందే చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే మధుమేహం ప్రాణాంతక వ్యాధిలా మారే అవకాశాలున్నాయి. అయితే ఈ వ్యాధి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు రకాల చిట్కాలను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల సులభంగా ఈ మధుమేహాం నుంచి ఉపశమనం పొందవచ్చు..
ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది ప్రీ డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే దీని కారణంగా చాలా మంది గుండె సంబంధింత సమస్యలకు కూడా గురవుతున్నారు. అయితే వీరు తప్పనిసరిగా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గుతాయి. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా ఈ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి.
ఈ ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది:
>>ఫైబర్ కలిగిన ఆహారాల్లో ఓట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో కరిగే ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటితో తయారు చేసిన ఆహారాలను అల్పాహారంలో భాగంగా తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గుతాయి.
>> గోధుమలతో చేసిన ఆహారాలను తీసుకుంటే 6 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఇది రక్తంలోని చక్కెర పరిమాణాలను ప్రభావితం చేసి మధుమేహాన్ని నియంత్రించేందుకు సహాయపడుతుంది.
>> యాపిల్ పండ్లు శరీరానికి చాలా అవసరం. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. అందుకే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారి వైద్యులు వీటిని తినమని సూచిస్తారు. మధుమేహం ఉన్నవారు ఈ పండును రోజూ ఒకటి తీసుకుంటే చాలు మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
>> సబ్జా విత్తనాలు కూడా మధుమేహంతో బాధపడుతున్నవారికి మంచి ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా ఈ విత్తనాలను ఆహారంలో చేర్చకోవాలి.
Also Read: Dussehra 2022: దసరా రోజు ఆయుధ పూజలో భాగంగా ఇలా చేయండి.. మీరు కోరిన కోరికలు తీరుతాయి..
Also Read: Dussehra 2022: శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook