Komatireddy Rajgopal Reddy: 2018 కంటే 9 రెట్లు పెరిగిన రాజగోపాల్ రెడ్డి ఆస్తి! మునుగోడు ఉపసమరంలో రచ్చరచ్చ..

Komatireddy Rajgopal Reddy:  తన మొత్తం ఆస్తుల విలువ రూ.222.67 కోట్లుగా అఫిడవిట్ లో చూపించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్ లో తన మొత్తం ఆస్తిని రూ. 24.5 కోట్లుగా చూపించారు.2018లో ఆయన భార్య అస్తుల విలువ రూ. 289.75 కోట్లు.అంటే 2018తో పోలిస్తే రాజగోపాల్ రెడ్డి ఆస్తి భారీగా పెరగగా.. ఆయన సతీమణి సంపద తరిగిపోయింది.

Written by - Srisailam | Last Updated : Oct 11, 2022, 12:39 PM IST
  • రాజగోపాల్ రెడ్డి ఆస్తులపై రచ్చ
  • నాలుగేళ్లలో రూ. 200 కోట్లు హైక్
  • తగ్గిన రాజగోపాల్ భార్య ఆస్తులు
Komatireddy Rajgopal Reddy: 2018 కంటే 9 రెట్లు పెరిగిన రాజగోపాల్ రెడ్డి ఆస్తి! మునుగోడు ఉపసమరంలో రచ్చరచ్చ..

Komatireddy Rajgopal Reddy:  తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నికలో పార్టీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల చరిత్రతోనే మునుగోడు అత్యంత ఖరీదైన ఎన్నికగా నిలవబోతుందనే చర్చ సాగుతోంది. మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తుల అంశం తెరపైకి వస్తోంది. బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన 18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసమే రాజగోపాల్ రెడ్డి కమలం గూటికి చేరారని టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నామినేషన్ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి సమర్పించిన ఆస్తుల లెక్కలు హాట్ టాపిక్ గా మారాయి. తన మొత్తం ఆస్తుల విలువ రూ.222.67 కోట్లుగా అఫిడవిట్ లో చూపించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి ఆస్తిలో స్థిరాస్తుల విలువ రూ.152.69 కోట్లు కాగా...చ‌రాస్తుల విలువ రూ.69.97 కోట్లు. ఆయన భార్య ఆస్తులు 52.44 కోట్లుగా పేర్కొన్నారు.

2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్ లో తన మొత్తం ఆస్తిని రూ. 24.5 కోట్లుగా చూపించారు రాజగోపాల్ రెడ్డి. 2018 అఫిడవిట్ ప్రకారం ఆయన భార్య అస్తుల విలువ రూ. 289.75 కోట్లు. అంటే 2018తో పోలిస్తే రాజగోపాల్ రెడ్డి ఆస్తి భారీగా పెరగగా.. ఆయన సతీమణి సంపద భారీగా తరిగిపోయింది. రాజగోపాల్ రెడ్డి ఆస్తి పెరిగి.. కుటుంబ మొత్తం ఆస్తి తగ్గిపోవడం చర్చగా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం 2018 కంటే ఆయన ఆస్తి దాదాపు 9 రెట్లు పెరిగింది. 2018లోతనకు రూ.  61.54 కోట్ల అప్పులు ఉన్నాయని చూపించారు  రాజగోపాల్ రెడ్డి. తాజాగా చూపిన లెక్కల్లో ఆయన అప్పులు రూ.61.5 కోట్లుగా ఉన్నాయి. తాజాగా రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన ఆస్తుల లెక్కలతో... 2018లో ఆయన ఇచ్చిన అఫిడవిట్ వైరల్ గా మారింది.

2018 నాటి అఫిడవిట్‌లో రాజగోపాల్ రెడ్డి ఆస్తి రూ. 24.5 కోట్లు కాగా.. 2022 లెక్కల ప్రకారం  ఆస్తులు దాదాపు 200 కోట్ల రూపాయల మేర పెరిగింది. ఆయన భార్య లక్ష్మి ఆస్తులు మాత్రం 240 కోట్ల రూపాయల మేర తగ్గింది.నాలుగేళ్లలో రాజగోపాల్‌ రెడ్డి దంపతుల ఆస్తులు కోట్లలో తగ్గుదల కనిపిస్తోంది.    రాజగోపాల్ రెడ్డితో పాటు తన భార్య ఆస్తుల విలువ కలిపితే తాజా అఫడవిట్లో 275.12 కోట్లు రూపాయలుగా చూపించారు. 2018 అఫడవిట్లో 314.25 కోట్లు రూపాయలుగా ఉంది. అంటే ఇద్దరి ఆస్తి కలిపి చూస్తే 2018తో పోల్చినప్పుడు ప్రస్తుతం 39.13 కోట్ల రూపాయలు తగ్గుదల కనిపిస్తోంది.  అంటే రాజగోపాల్ రెడ్డి ఆస్తి పెరిగి.. ఆయన భార్య ఆస్తి తగ్గడంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి భార్య ఆస్తులను తన పేరుకు బదిలీ చేశారా, లేదా నిజంగానే ఆమె ఆస్తులు తగ్గిపోయాయా అన్న దానిపై  స్పష్టత లేదు. దీనిపై రాజగోపాల్ రెడ్డి కూడా క్లారిటీ ఇవ్వలేదు. రాజగోపాల్ రెడ్డి భార్య తన ఆస్తుల్ని పోగొట్టుకున్నారా అనే విషయం మునుగోడులో హట్ టాపిక్ గా మారింది.

Also Read: Munugode Posters: ఫోన్ పే తరహాలో కాంట్రాక్ట్ పే.. మునుగోడులో పోస్టర్ల కలకలం 

Also Read: Munugode Bypoll: కారెక్కిన కర్నాటి.. అదే బాటలో తాడూరి! మునుగోడుపై ప్రగతి భవన్ నుంచి ఆపరేషన్.. కమలంలో కలకలం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News