ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా ఉమెన్ చాందీని నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీ బాధ్యతలను చూసుకుంటున్న దిగ్విజయ్ సింగ్‌ను తప్పించి కాంగ్రెస్ పార్టీ ఉమెన్ చాందీని నియమించింది.
Oommen Chandy appointed Congress in-charge of Andhra Pradesh, replaces Digvijay Singh. (File pic) pic.twitter.com/WrRL2NN360
— ANI (@ANI) May 27, 2018
భారతీయ జాతీయ కాంగ్రెస్ నాయకుడైన ఉమెన్ చాందీ కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశారు. 2004-2006, 2011-2016 మధ్య కాలంలో ఆయన సీఎంగా బాధ్యతలను నిర్వహించారు. 2006-11 వరకు కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కేరళ పుతుప్పల్లి నియోజకవర్గం నుండి దశాబ్దకాలంగా 1970, 1977, 1980, 1982, 1987, 1991, 1996, 2001, 2006, 2011, 2016లలో ఎన్నికైతూ వస్తున్నారు. కే.కరుణాకరణ్, ఏకే అంటోనీ సీఎంలుగా ఉన్న సమయంలో వారి కేబినేట్లో మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాందీపై 'సోలార్ స్కాం' ఆరోపణలు వచ్చాయి.