Diet In Asthma: ఆస్తమా వ్యాధితో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జాగ్రత్త వహించకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. అయితే ఆధునిక జీనవ శైలి కారణంగా చిన్న పిల్లలు కూడా ఆస్తమా బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యలకు గురి కావడానికి పెరుగుతున్న కాలుష్యం, బలహీనమైన రోగనిరోధక శక్తే కారణమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆస్తమా వ్యాధి తీవ్రతను బట్టి ఆహారాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు తీసుకునే ఆహాంలో పలు రకాల ఆహారాలను చేర్చుకోవాలి. వీటిని తినడం వల్ల పలు రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ వ్యాధి కూడా నియంత్రణలో ఉంటుంద. అయితే ఈ ఆస్తమా వ్యాధి వారు ఎలాంటి డైట్‌ను అనుసరించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఆస్తమా రోగులకు ఆహారాలు తీసుకోండి:
1. పప్పులు:
శరీరానికి అవసరమైన పోషకాలు పప్పుల్లో లభిస్తాయి. కాబట్టి వీటిని తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా బాగుంటుంది. అంతేకాకుండా శరీరానికి ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి. ఆస్తమా రోగులు మూంగ్ పప్పు, సోయాబీన్, నల్ల శనగలు, ఇతర పప్పులను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. పప్పులను క్రమం తప్పకుండా తినడం వల్ల ఊపిరితిత్తులు కూడా బలంగా తయారవుతాయి.
2. పచ్చి కూరగాయలు:
ఆస్తమా వ్యాధులతో బాధపడేవారు ఆహారంలో భాగంగా పచ్చి కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పచ్చి కూరగాయలు తినడం వల్ల ఊపిరితిత్తులలో కఫం తగ్గి అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరానికి అన్ని విటమిన్లు అందుతాయి. అంతేకాకుండా ఆస్తమా సమస్యలను తగ్గించేందేకు ప్రధాన పాత్ర పోషిస్తుంది.
3. విటమిన్-సి:
ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల శరీరానికి పుష్కలమైన యాంటీ-ఆక్సిడెంట్లను అందుతాయి. దీంతో ఊపిరితిత్తులు సురక్షితంగా మారుతాయి. ఆస్తమా అటాక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
4. తులసి:
తులసిలో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ఈ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. అంతేకాకుండా వీటితో తయారు చేసిన టీలకు బదులుగా తులసి టీలను తీసుకోవడం వల్ల ఈ సమస్యలకు సులభంగా చెక్ పెట్టొచ్చు.
ఆస్తమా రోగులు వీటిని తినకూడదు:
ఆస్తమా రోగులు తమ ఆహారంలో గోధుమలు, గుడ్డు, సోయా, బొప్పాయి, అరటిపండు, పంచదార, బియ్యం, పెరుగు తినకూడదు. అంతేకాకుండా వేయించిన వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు దయచేసి నిపుణులను సంప్రదించండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read : MLC Kavitha: లిక్కర్ స్కాంలో సీబీఐ అరెస్టులు.. ఢిల్లీలో కవిత! ఏం జరగబోతోంది?
Also Read : Impact Player: క్రికెట్ చరిత్రలో మొదటిసారి.. తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకి హృతిక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి