Guava Benefits in Diabetes: మధుమేహాన్ని నియంత్రించడానికి ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం. వీరు తీసుకునే ఆహారాలను బట్టి రక్తంలో చక్కెర పరిమాణాలు పెరగడం, తగ్గడం వంటి ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మధుమేహన్ని నియంత్రించడానికి పలు చిట్కాలు ఉన్నాయి. ఆ చిట్కాలు పాటించడం వల్ల కూడా మధుమేహం సులభంగా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ నుంచి సులభంగా తగ్గించుకోవడానికి జామ పండు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దీనిని ఉపయోగించి ఎలా మధుమేహానికి చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మధుమేహం వ్యాధిగ్రస్తులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలను కలిగి ఉన్న ఆహారాన్నిరోజూ తీసుకోవాల్సి ఉంటుంది. జామలో గ్లైసెమిక్ సూచికలు తక్కువగ ఉంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
జామలో ఫైబర్ ఉంటుంది:
మధుమేహన్ని నియంత్రించుకోవడానికి పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే వీటిల్లో ఫైబర్ పరిమాణాలు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గిస్తాయి.
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం..నారింజ కంటే జామలో 4 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుందని.. వీటిని క్రమం తప్పకుండా మధుమేహంతో బాధపడుతున్న వారు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. జామను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి కూడా సులభంగా పెరుగుతుంది.
Also read: Shani Margi 2022: శని ప్రభావంతో పండగ ముందు ఈ రాశువారికి తీవ్ర నష్టాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook