Big King snake eats Patch nosed snake very easily: కప్పలని పాము మింగడం సహజం. గుడ్లు, చిన్న జంతువులను కూడా తింటుంటాయి. ఇలాంటి ఘటలను మనం అప్పుడప్పుడు చూసే ఉంటాం. అయితే పామును మరో పాము మింగడం చాలా అరుదు. కొన్ని రకాల జాతుల పాములు మాత్రమే.. ఇలా మిగేస్తుంటాయి. కొండచిలువ దొరికిన దేన్నీ వదలదు. అది మనిషి అయినా.. జంతువు అయినా.. పాము అయినా చుట్టేసి మింగేస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియోలో కింగ్ స్నేక్.. భారీ పామును వేటాడి మిగేసింది. ఆ వేట మామూలుగా ఉండదు.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. పాచ్-నోస్డ్ పామును కింగ్ స్నేక్ మింగేస్తుంది. ఈ ఘటన యూఎస్ స్టేట్ అయిన ఆరిజోనాలో చోటుచేసుకుంది. ఎడారి ప్రాంతంలో పాచ్-నోస్డ్ స్నేక్ వెళుతుండగా.. కింగ్ స్నేక్ దాన్ని చూస్తుంది. దాన్ని వేటాడి ముందుగా దాన్ని చుట్టేస్తోంది. కింగ్ స్నేక్ చుట్టేయడంతో పాచ్-నోస్డ్ ఎటూ కదలకుండా ఉంటుంది. పాచ్-నోస్డ్ తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు.
పాచ్-నోస్డ్ తలను పట్టేసిన కింగ్ స్నేక్.. ముందుగా దాన్ని చంపేస్తుంది. మెల్లిగా తలను మింగేసిన కింగ్ స్నేక్.. ఆపై కొద్దికొద్దిగా మింగేస్తుంది. భారీపొడవున్న పాచ్-నోస్డ్ పామును కింగ్ స్నేక్ మొత్తం మింగేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇందుకు సంబందించిన వీడియోను 'Nature In Your Face' అనే యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసింది. ఈ వీడియో ఏడాది క్రితందే అయినా.. ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోకి 349,980 వ్యూస్ వచ్చాయి. ఒక జాతికి చెందిన జంతువు..అదే జాతి జంతువును తినడాన్ని కానిబాలిజం అని పిలుస్తారు.
Also Read: టీమిండియా 'టీస్ మార్ ఖాన్ ఏం కాదు'.. టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తుంది: అక్తర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook