Cable Bridge Collapse tragedy: కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 137 కి చేరినట్టు సమాచారం అందుతోంది. నదిలో పడిపోయిన వారిలో 177 మందిని సురక్షితంగా రక్షించామని, 19 మంది క్షతగాత్రులు గాయాలపాలై మోర్బి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని గుజరాత్ సర్కారు తెలిపింది. గుజరాత్ సమాచార, పౌర సంబంధాల శాఖ ఈ సమాచారం వెల్లడించింది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో భారీ సంఖ్యలో ఇండియన్ ఆర్మీ బలగాలు, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
మచ్చు నదిపై నిర్మించిన తీగల వంతెన కూలిన ఘటనలో నిన్న సాయంత్రం నుంచి నిరంతరం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చీకటి వేళ కావడంతో సహాయక చర్యలకు కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ.. జిల్లా అధికార యంత్రాంగం, ప్రభుత్వంలోని పెద్దలు స్వయంగా ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. భారీ క్రేన్లు, బోట్ల సహాయంతో ఫ్లడ్ లైట్స్ వెలుతురులో సహాయక చర్యలు ఆగకుండా చూసుకున్నారు.
#WATCH live via ANI Multimedia | Gujarat Home Minister Harsh Sanghavi briefs on #Morbi bridge tragedyhttps://t.co/7f66GVVtZn
— ANI (@ANI) October 31, 2022
ఘటన స్థలానికి ముఖ్యమంత్రి, హోంమంత్రి
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్, ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి హర్ష సంఘవి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బ్రిజేష్ మేర్జా మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి మోర్బిలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
Gujarat | Early morning visuals from the accident site in #Morbi where more than 100 people have lost their lives after a cable bridge collapsed.
Gujarat Home Minister Harsh Sanghavi is also present at the spot. pic.twitter.com/TxtzWySFGT
— ANI (@ANI) October 31, 2022
సిట్ ఏర్పాటు చేసిన గుజరాత్
కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై గుజరాత్ సర్కారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసింది. మునిసిపాలిటీస్ కమిషనర్ రాజ్ కుమార్ బెనివాల్ ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి నేతృత్వం వహించనున్నారు. మోర్బికి బయల్దేరిన రాజ్ కుమార్ స్పందిస్తూ.. సిట్ బృందం తొలుత బ్రిడ్జి కూలిపోవడానికి కారణం ఏంటో కనుక్కుంటుందని.. ఆ తర్వాత ఇలాంటి మరో ఘటన పునరావృం కాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
Also Read : Cable Bridge Collapsed: కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో 60 దాటిన మృతుల సంఖ్య
Also Read : Cable Bridge Collapsed: కుప్పకూలిన కేబుల్ బ్రిడ్ది.. తీగల వంతెనపై 500 మంది సందర్శకులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి