/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Chandra Grahan Temple Closing Timings: నేడు (మంగళవారం) ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇవాళ మధ్యాహ్నం 2.40 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6.19 గంటల వరకు ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం దేశంలోని అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుందని అంటున్నారు. గ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారతాడు. చంద్రగ్రహణ నేపథ్యంలో మంగళవారం పలు ఆలయాలు మూసివేశారు. 

చంద్రగ్రహణం సందర్భంగా విశాఖ సింహాచలం అప్పన్న ఆలయం మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్వామివారికి రాజభోగం నిర్వహించి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు చెప్పారు. ఈరోజు అంతా ఆలయం మూసి వేసే ఉంటుందన్నారు. భక్తులకు నేడు స్వామివారి దర్శనానికి అవకాశం లేదని చెప్పారు. రేపు ఉదయం 6:30 గంటల నుంచి యథావిధిగా స్వామివారి దర్శనాలు ఉంటాయన్నారు. 

చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మంగళవారం ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఆలయం మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాక్షి గణపతి, పాలధార పంచదార, హఠకేశ్వరం, శిఖరం ఆలయాలు మూసివేశారు. సాయంత్రం 6.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయశుద్ది, మంగళ వాయిద్యాలు, సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలు నిర్వహిస్తారు. రాత్రి 8.00 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. అదేవిధంగా ఆర్జితసేవలు, శాశ్వతసేవలు, పరోక్షసేవలు నిలిపివేశారు. భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు.
మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా ఉండదు. రాత్రి 8 గంటల నుంచి అల్పాహారం అందజేస్తున్నట్లు ఈఓ లవన్న తెలిపారు.

సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా జగిత్యాల జిల్లా  ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేశారు. ఉదయం 5.00 గంటలకు అన్ని దేవాలయాలలో స్వామివార్లకు అభిషేకాలు , హారతి మంత్రపుష్పం నిర్వహించారు ఆలయ అర్చకులు. రేపు ఉదయం 6 గంటలకు దేవాలయములు తెరిచి సంప్రోక్షణ, అభిషేకం నిర్వహించి.. ఉదయం 9 గంటలకు భక్తుల దర్శనానికి అనుమతి ఉంటుంది.

రాజన్నసిరిసిల్ల జిల్లాలో చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఉదయం సుప్రభాత సేవ ప్రాత కాల పూజ అనంతరం ఆలయాన్ని మూసివేశారు. గ్రహణం అనంతరం సాయంత్రం 6:30 నిమిషాలకు ఆలయ సంప్రోక్షణ అనంతరం ఆలయాన్ని తెరవనున్నారు. రాత్రి 8 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఉంటుంది.

చంద్రగ్రహణం సందర్భంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని అధికారులు మూసివేశారు. ఉదయం 7:30 నుంచి రాత్రి 7 వరకు ద్వారబంధనం.  గ్రహణం వీడిన అనంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, శాంతి హోమం నిర్వహిస్తారు. బుధవారం తెల్లవారుజాము నుంచి తిరిగి భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు.

Also Read: Chandra Grahan 2022: నేడే చంద్రగ్రహణం.. ఈ రోజు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

Also Read: Lunar Eclipse: ఇవాళ చంద్రునితోపాటు కనిపించనున్న మరో 3 పెద్ద గ్రహాలు.. అవేంటో తెలుసా?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
chandra grahan 2022 effect temples closed in andhra pradesh and telangana chandra grahan timings details here
News Source: 
Home Title: 

Chandra Grahan Time: చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఈ సమయాల్లో ఆలయాలు మూసివేత

Chandra Grahan Time: చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఈ సమయాల్లో ఆలయాలు మూసివేత
Caption: 
Chandra Grahan Temple Closing Timings (Source: Zee Telugu News)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Chandra Grahan Time: చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఈ సమయాల్లో ఆలయాలు మూసివేత
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, November 8, 2022 - 08:34
Created By: 
Krindinti Ashok
Updated By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
226
Is Breaking News: 
No