Baladiya Buzz Interview : గీతూ ఎలిమినేషన్.. బాలాదిత్య కామెంట్స్ వైరల్

Baladiya Buzz Interview బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలాదిత్య.. యాంకర్ శివతో బజ్ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. గీతూ ఎలిమినేషన్ మీద కామెంట్స్ చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2022, 12:23 PM IST
  • బయటకు వచ్చిన బాలాదిత్య
  • యాంకర్ శివతో బాలాదిత్య ముచ్చట్లు
  • గీతూ ఎలిమినేషన్ మీద కామెంట్స్
Baladiya Buzz Interview : గీతూ ఎలిమినేషన్.. బాలాదిత్య కామెంట్స్ వైరల్

Baladiya Buzz Interview : బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలాదిత్య మిగతా కంటెస్టెంట్ల గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. యాంకర్ శివ చేస్తోన్న బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో బాలాదిత్య గీతూ మధ్య జరిగిన గొడవ గురించి యాంకర్ శివ అడిగాడు. ప్రవచనాలు చెప్పడం వల్ల మీకు బయట ఒక పేరు పెట్టారు? అని యాంకర్ శివ కౌంటర్ వేశాడు. ప్రవచనాలు చెప్పడం నా వృత్తి కాదు.. మంచి చెప్పాలని అనిపించినప్పుడు నేను ఆగను అని బాలాదిత్య అన్నాడు.

నేషనల్ టెలివిజన్‌లో ఒక అమ్మాయిని సిగ్గుందా? అని అనడం అంటూ యాంకర్ శివ ప్రశ్నించాడు. ఏ సందర్భంలో మాట్లాడాను అని బాలాదిత్య అంటే.. మీ కాంటెక్స్ట్ ఏంటి? అని యాంకర్ శివ మళ్లీ ఎదురు ప్రశ్నించాడు. పక్క వాళ్లని గుచ్చడం నీ కారెక్టరా? అని ఆదిత్య అంటే.. ఆ మాట అనడం కరెక్టా? అని యాంకర్ శివ అడుగుతాడు. ఆ మాట తప్పు కానీ నా బాధ తప్పు కాదు అని ఆదిత్య తన మాటలతో మాయ చేశాడు.

ఈ విధానాలన్నీ పనికొచ్చాయని అనుకుంటున్నారా? అని యాంకర్ శివ అడిగితే.. ఆటకు పనికొచ్చే విధానాలను నేను వాడితే.. ఆట కోసం మారినట్టు ఉంటుంది.. నాలా నేను ఆడాను నేను నా సిద్దాంతాలతో ఆడాను.. అని ఆదిత్య అంటాడు. మీకు కోపం రాదని మొదట్లో చెప్పారు కదా? అని అంటే.. ప్రతీదానికి కోపం రాదు అని బాలాదిత్య అంటాడు. మీరు ప్రతీ దానికి కోప్పడరు.. సాగదీస్తారు.. ఎక్స్ ప్లెయిన్ చేస్తుంటారు అని అంటాడు యాంకర్ శివ.

ఆఫ్ట్రాల్ సిగరెట్లు అని అన్న బాలాదిత్య అలా చేయడం కరెక్టేనా? గీతూ మీ వల్లే ఎలిమినేట్ అయింది అని యాంకర్ శివ అంటాడు. ఎవరు చేసిన పనులకు వారే బాధ్యులు అని స్టేట్మెంట్ ఇస్తాడు ఆదిత్య. కీర్తి ఓ విషయం గురించి ఎక్కువగా థింక్ చేస్తుంటుంది. శ్రీహాన్ స్పాంటేనియస్ డిసీషన్స్‌లో వీక్, శ్రీ సత్యకు కాస్త నోటి దురుసు.. నామినేషన్‌లో ఎవరైనా ట్రిగ్గర్ చేస్తే లౌడ్ అవుతుంది.. ఆదిరెడ్డి చాలా తెలివైన వ్యక్తి అని చెప్పుకొచ్చాడు బాలాదిత్య.
 

Also Read : Bigg Boss Vasanthi Elimination : బిగ్ బాస్ ఇంట్లో ఇకపై అందం కనుమరుగు.. వసంతి పాప అవుట్

Also Read : Samyuktha Hegde Bikini Video : వామ్మో ఇదేం ఊపడం సామీ.. బికినీలో సంయుక్త హెగ్డే సందడి.. వీడియో వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News