DA Hike For Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న జీతం.. లెక్కలు ఇలా..

7th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు మరోసారి డీఏ భారీగా పెరగనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త డీఏ పెంపు ఉంటుందని తెలుస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2022, 03:00 PM IST
DA Hike For Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న జీతం.. లెక్కలు ఇలా..

7th Pay Commission: దేశంలోని లక్షలాది మంది కేంద్ర ఉద్యోగులకు శుభవార్త. కరువు భత్యాన్ని మరోసారి పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. AICPI ఇండెక్స్ డేటా నుంచి ఈ మేరకు సమాచారం బయటకు వచ్చింది. 2023 సంవత్సరం ప్రారంభంలోనే ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ లభిస్తున్నట్లు తెలుస్తోంది.

AICPI ఇండెక్స్ గణాంకాల ప్రకారం ఈసారి కూడా ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)‌ను 4 శాతం వరకు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత ప‌రిస్థితులు బట్టి జ‌న‌వ‌రిలోనే ప్ర‌భుత్వం డీఏ పెంచ‌బోతోంద‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

జనవరి 2023 నుంచి ఉద్యోగులకు పెరిగిన డీఏ అమలులోకి వస్తుందని.. మార్చి 2023 నాటికి ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారం. ప్రస్తుతం ఉద్యోగుల డీఏ 38 శాతం ఉంది. ఉద్యోగుల డీఏలో 4 శాతం పెంచితే 42 శాతానికి పెరుగుతుంది. బేసిక్ శాలరీ నెలకు రూ.720 నుంచి వరకు రూ.2276 పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ గణాంకాలను AICPI విడుదల చేసింది . 

కనీస జీతం స్థాయిలో లెక్కలు

  • ఉద్యోగి బేసిక్ శాలరీ–రూ.18,000
  • కొత్త డీఏ (42%)–నెలకు రూ.7,560
  • ఇప్పటివరకు ఉన్న డీఏ (38%)–నెలకు రూ.6,840
  • ఎంత డీఏ పెరనుంది-నెలకు రూ.720
  • వార్షిక జీతంలో పెంపు -720X12= రూ.8,640

గరిష్ట జీతం స్థాయిలో ఇలా..

  • ఉద్యోగి బేసిక్ శాలరీ-రూ.56,900
  • కొత్త డియర్‌నెస్ అలవెన్స్ (42%)-రూ.23,898
  • ఇప్పటివరకు డియర్‌నెస్ అలవెన్స్ (38%)-నెలకు రూ.21,622
  • ఎంత డీఏ పెరగనుంది-నెలకు రూ.2276
  • వార్షిక జీతంలో పెంపు -రూ.2276X12=రూ.27312

Also Read: YSRCP: మంగళగిరిలో వైసీపీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యే ఆర్కే అనుచరుడు టీడీపీలోకి జంప్‌  

Also Read: Super Star Krishna Health update : హాస్పిటల్లో సూపర్ స్టార్ కృష్ణ.. ఆందోళనలో అభిమానులు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News