Madonna B Sebastian Bumper Offer: మడొన్నాకు కలిసొచ్చిన లక్.. బంపర్ ఆఫర్ పట్టేసిందిగా!

Madonna B Sebastian Bumper Offer: అనుపమా పరమేశ్వరన్ బిజీ అవడం మరో మళయాళ భామకు కలిసొచ్చింది. తాజాగా మడొన్నా సెబాస్టియన్ కు ఒక బంపర్ ఆఫర్ తగిలినట్టు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే 

 
  • Nov 29, 2022, 08:20 AM IST
1 /5

తెలుగువారికి మడొన్నా సెబాస్టియన్ గురించి పెద్దగా పరిచయం లేదు కానీ వాస్తవానికి ఆమె తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది,    

2 /5

ప్రేమమ్ సినిమా ద్వారా మలయాళ సినీ పరిశ్రమలో హీరోయిన్ గా మారిన ఆమె ఆ తర్వాత తమిళంలో కూడా ఒక సినిమాలో హీరోయిన్ గా నటించింది. తర్వాత ఎక్కువగా తమిళ మలయాళ సినిమాల్లో ఆమె నటిస్తూ వచ్చింది. తెలుగు ప్రేమమ్ లో కూడా ఆమె ఒక కీలక పాత్రలో నటించి ప్రేక్షకులకు పరిచయమైంది.     

3 /5

అలాగే ఆమె శ్యాం సింగరాయ్ అనే సినిమాలో కూడా లాయర్ పద్మావతి పాత్రలో కనిపించింది. అయితే ఇప్పుడు ఈ భామ నక్కతోక తొక్కినట్లుగా తెలుస్తోంది.     

4 /5

డీజే టిల్లు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమా చేస్తున్నారు ఇప్పటికే ఆ సినిమా నుంచి ఒకసారి శ్రీ లీలా మరోసారి అనుపమ పరమేశ్వరన్ తప్పుకోవడంతో ఇప్పుడు ఆ పాత్ర మడొన్నా సెబాస్టియన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.     

5 /5

కేరళకు చెందిన ఈ భామ ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ సరసన హీరోయిన్గా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.