Mahesh Babu New Look: విషాదాల నుంచి కోలుకున్న మహేష్.. పని మొదలుపెట్టానంటూ పోస్ట్!

Mahesh Babu New Look : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదాలు నెలకొనగా ఎట్టకేలకు చాలా కాలానికి ఆయన కోలుకున్నారు, ఆయన తాజాగా దానికి సంబందించిన ఫోటో షేర్ చేశారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 3, 2022, 07:08 PM IST
Mahesh Babu New Look: విషాదాల నుంచి కోలుకున్న మహేష్.. పని మొదలుపెట్టానంటూ పోస్ట్!

Mahesh Babu New Look Viral in Social Media: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో జనవరి నెలలో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతిచెందగా సెప్టెంబర్ నెలలో ఆయన తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. ఇక తాజాగా అక్టోబర్ నెలలో సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో మహేష్ బాబు తీవ్ర విషాదంలో మునిగి పోయినట్లు అయింది/ ఒకానొక దశలో ఆయన తీవ్ర విషాదంలో మునిగిపోయి ఫోన్లు కూడా ఎత్తడం మానేసినట్లుగా గతంలో హీరో అడవి శేష్ ఒక సందర్భంలో కూడా వెల్లడించారు.

వరుసగా మూడు విషాదాలు వెంట వెంటనే రావడంతో మహేష్ బాబు బాగా డీలా పడిపోయాడని ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని అడవి శేష్ చెప్పుకొచ్చారు. అయితే ఎట్టకేలకు మహేష్ బాబు తాను మళ్ళీ కోలుకున్నట్లుగా తిరిగి పని ప్రారంభించినట్లుగా పేర్కొన్నాడు. తాజాగా మహేష్ బాబు తన సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో షేర్ చేశారు. ఫోటో షేర్ చేయడమే కాక తాను మళ్ళీ పని మొదలు పెట్టాను అంటూ అని కామెంట్ చేశారు. ఇక ఈ ఫోటో చూస్తున్నట్లయితే మౌంటెన్ డ్యూ యాడ్ కోసం ఆయన అయితే ఒక యాడ్ షూట్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

ఆ యాడ్ కు డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ ప్రస్తుతానికి మహేష్ బాబు అయితే బిజీబిజీగా గడుపుతున్నట్టు క్లారిటీ వచ్చింది. మరోపక్క  మహేష్ బాబు తరువాతి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. మహేష్ బాబు కెరీర్ 28 సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో శ్రీలీలను రెండో హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ఆ విషయం మీద అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

మరోపక్క మరో సీనియర్ హీరోయిన్ కూడా ఈ సినిమా కోసం రంగంలోకి దింపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే ఒక టాలీవుడ్ టాప్ హీరోయిన్ తో ఐటెం సాంగ్ చేయించే యోచనలో కూడా త్రివిక్రమ్ ఉన్నారని టాక్ నడుస్తోంది. ఆమె పేరు బయటకు రాలేదు కానీ రష్మిక మందన్న అనే ప్రచారం అయితే జరుగుతుంది.

ఇక ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ల మీద చినబాబు, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొత్తం మీద మహేష్ బాబు ఒక ఫోటో షేర్ చేయడంతో ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటో మీద మీరు కూడా ఒక లుక్కేయండి అలాగే ఆ ఫోటోపై మీ కామెంట్లను కూడా తెలియజేయండి.

Also Read: Koratala Siva: మీడియా టెన్షన్.. చివరి నిముషంలో ముఖం చాటేసిన కొరటాల శివ!

Also Read: Karan Johar Suicide: బ్రహ్మాస్త్ర దెబ్బ.. కరణ్ జోహార్ సూసైడ్ అటెంప్ట్.. అప్పిచ్చిన అంబానీ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News