How To Control Dandruff In Winter: శీతాకాలంలో జుట్టులో చుండ్రు పెరగడం సర్వసాధారణమైన సమస్య. అయితే చాలామందిలో చుండ్రు విపరీతంగా పెరుగుతుంది. దానిని గీసినప్పుడల్లా జుట్టుతోపాటు చండ్రు కూడా మీ భుజాలపై వచ్చి పడుతుంది. ఇది ఇబ్బంది కలిగించినప్పటికీ ప్రతి శీతాకాలంలో అందరూ ఈ సమస్య బారిన పడతారు. ఇంకొందరిలో చుండ్రు పెరగడం వల్ల జుట్టులో దురద, జిడ్డు పేరుకుపోవడం వంటి సమస్యలు కూడా చూడవచ్చు. అయితే ఈ చుండ్రు సమస్య నుంచి సులభంగా విముక్తి పొందడానికి..ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ క్రింది చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.
చుండ్రుని ఎలా వదిలించుకోవాలో తెలుసా..?:
వేప ఆకు:
వేప చెట్టు ఆకులను తీసుకొని పేస్టులా తయారు చేసుకుని చుట్టూలోని చుండ్రు ఉన్నచోట అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వల్ల సులభంగా చుండ్రు నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ ఆకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ పేస్టును జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్యలతో పాటు చాలా రకాల జుట్టు సమస్యలు కూడా దూరం అవుతాయి.
కొబ్బరి నూనె:
శీతాకాలంలో తరచుగా చుండు సమస్యలతో బాధపడుతున్న వారు ఒక గిన్నెలో కొబ్బరి నూనెను తీసుకొని అందులో ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి.. తలకు పట్టించాలి ఇలా తలకు పట్టించిన తర్వాత 10 నిమిషాల 15 నిమిషాల పాటు బాగా మర్దన చేయాలి. ఇలా చేసిన తర్వాత శుభ్రమైన నీటితో స్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టులోని చుండ్రుకు చెక్ పెట్టొచ్చు.
పెరుగు:
పెరుగు కూడా చుండును తొలగించడానికి వినియోగిస్తారు. ఎలాగో తెలుసా..? ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకొని దానిలో నిమ్మరసం వేసి జుట్టుకు అప్లై చేయాలి ఇలా అప్లై చేసిన 20 నిమిషాల తర్వాత తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత బాగా తలను టవల్తో తుడుచుకోవాలి. ఇలా పెరుగును తలకి క్రమం తప్పకుండా అప్లై చేస్తే త్వరలోనే ఫలితం పొందుతారు.
ఆపిల్ వెనిగర్:
ఆపిల్ వెనిగర్ ని జుట్టుకు కూడా ఉపయోగిస్తారని చాలామందికి తెలియదు. అయితే ఇందులో ఉన్న గుణాలు జుట్టు సమస్యలను కూడా దూరం చేస్తాయి. ముఖ్యంగా చుండ్రు సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ఔషధంలా పనిచేస్తుంది. చుండ్రును తగ్గించుకోవడానికి ముందుగా రెండు టీ స్పూన్ల యాపిల్ వెనిగర్ ని తీసుకొని అప్లై చేయాలి అప్లై చేసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా చుండు సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.
Also Read: Chittoor Road Accident: డీజిల్ ఆదా చేద్దామని ఆశతో నిర్లక్ష్యం.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook